Telugu News » accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురి మృతి..!

accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురి మృతి..!

వనపర్తి(Vanaparthi) జిల్లా కొత్తకోట జాతీయ రహదారి 44పై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి(Five people died) చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

by Mano
Road accident: A terrible accident.. Seven people including three children died..!

వనపర్తి(Vanaparthi) జిల్లా కొత్తకోట జాతీయ రహదారి 44పై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(road accident) చోటుచేసుకుంది. టెక్కలయ్య దర్గా సమీపంలో అదుపుతప్పిన కారు వేగంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి(Five people died) చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Accident: Fatal road accident.. Five people including three children died..!

ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కారు కర్ణాటకలోని బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో అబ్దుల్ రహమాన్ (62), సలీమా జీ (85), చిన్నారులు బుస్రా (2), మరియా (5), వాసిర్ రవుత్ (7 నెలలు) ఉన్నారు. గాయపడిన వారిలో సమీరా (5), హుస్సేన్ (10), షఫీ, ఖదీరున్నీసా, హబీబ్, అలీ, షాజహాన్ బేగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిలో అలీకి వనపర్తి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో 12 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున రెండున్నర నుంచి మూడు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగి ఉంటుందని.. డైవర్ నిద్రమత్తులో కారు నడపడం వల్లే ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. అందులో చిక్కుకున్న చిన్నారుల మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు, ఎల్ అండ్ టీ సిబ్బంది గంటకుపైగా శ్రమించాల్సి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

You may also like

Leave a Comment