Telugu News » Hyderabad : టాలీవుడ్ లో విషాదం.. మరణించిన ప్రముఖ నటుడు..!

Hyderabad : టాలీవుడ్ లో విషాదం.. మరణించిన ప్రముఖ నటుడు..!

బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఎన్నో పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నారు వీరభద్రరావు.. కాగా ప్రమాదవశాత్తూ రెండు నెలల క్రితం కింద పడిపోయిన ఆయన.. అప్పటి నుంచి కోమాలోనే ఉన్నట్లు సమాచారం..

by Venu

టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకొంటున్నాయి.. గత సంవత్సరం ఎందరో పేరున్న నటులు మరణం బారిన పడిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా కొందరు మరణిస్తుండగా.. వృద్ధాప్యం వల్ల మరి కొందరు నటి నటులు మృత్యువాత పడ్డారు.. తాజాగా ప్రముఖ నటుడు (Actor) వీరభద్రరావు (Veerabhadra Rao) చనిపోయారు.

బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఎన్నో పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నారు వీరభద్రరావు.. కాగా ప్రమాదవశాత్తూ రెండు నెలల క్రితం కింద పడిపోయిన ఆయన.. అప్పటి నుంచి కోమాలోనే ఉన్నట్లు సమాచారం.. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్‌ (Hyderabad)లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు..

మరోవైపు బుల్లి తెర నటుడు వీరభద్రరావు పలు టీవీ సీరియల్స్ (TV Serials)తో పాటుగా సినిమాల్లో (Movies) సైతం ఎన్నో పాత్రలు చేశారు.. ఈమేరకు ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖుల, టీవీ నటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఫ్యామిలీకి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పార్థిస్తున్నారు..

You may also like

Leave a Comment