Telugu News » Anasuya turns tears కన్నీరు పెట్టుకున్న అనసూయ….కారణం ఏంటంటే ..!?

Anasuya turns tears కన్నీరు పెట్టుకున్న అనసూయ….కారణం ఏంటంటే ..!?

ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ...డాన్స్ లు చేస్తూ, ఫుల్ జోష్ లో ఉండే నటి అనసూయా భరద్వాజ్(Anasuya Bhardwaj) కన్నీళ్లు పెట్టుకుంది.

by sai krishna

ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ…డాన్స్ లు చేస్తూ, ఫుల్ జోష్ లో ఉండే నటి అనసూయా భరద్వాజ్(Anasuya Bhardwaj) కన్నీళ్లు పెట్టుకుంది. కన్నీటికి కారణం తెలియదు గానీ ఫ్యాన్స్ మాత్రం అనసూయ ఏడ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.అయితే తన కన్నీరు పెట్టుకున్న వీడియోతో పాటు ఒక పోస్ట్ కూడా అటాచ్ చేసింది.

‘హలో! మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతారని తెలుసు. ఇక విషయానికొస్తే..నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియా(Social media) ప్లాట్ఫామ్స్ ప్రపంచవ్యాప్తంగా ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేందుకు


అలాగే సమాచారం పంచుకునేందుకు, ఒకరికి ఒకరు ఉన్నామని చెప్పుకునేందుకు, విజ్ఞానాన్ని, సంతోషాన్ని, జీవన విధానాలను, సంస్కృతి సంప్రదాయాలను షేర్ చేసుకునేందుకే ఉంది. మరి నిజంగా ఇప్పుడు ఇదే జరుగుతుందా?’ అని పోస్ట్లో రాసుకొచ్చారు.

 

‘ఏదేమైనా.. ఈ పోస్ట్ ఎందుకు షేర్ చేశానంటే.. నేను ఇక్కడ నా ఫొటోషూట్లు, డ్యాన్స్లు.. అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అవన్నీ నా జీవితంలో భాగమే. అయితే నా లైఫ్లో బాధాకరమైన రోజులు కూడా ఉన్నాయి. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు నేనూ బలహీనమవుతా.. కన్నీళ్లూ పెట్టుకుంటా. మనిషి లైఫ్లో అన్నీ ఉంటాయి.

ఓ సెలబ్రిటీగా.. ఫీలింగ్స్ న్యూట్రల్ గా ఉంచుకునేందుకు నాపై ఒత్తిడి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నిజమైన బలం కాదు. వీక్నెస్ ను షేర్ చేసుకోవడమే నా బలం. ఆలాగే అందరూ సమస్య ఎదురైనప్పుడు.. ఆ బాధ పోగొట్టుకొని ఒకట్రెండు రోజుల్లో నవ్వుతూ సవాళ్లను ఎదుర్కోండి.

అంతేకాని సమస్యలు చూసి పారిపోకూడదు. ఇతరులపై మీరు చేసే కామెంట్లు వారిని ఇబ్బంది పెట్టవచ్చు. అందుకని ఎదుటివారి పట్లు కొంచెం దయతో ఉండండి.’ అని ఇన్స్టా పోస్ట్( Insta post)లో అనసూయ రాశారు.

You may also like

Leave a Comment