Telugu News » Andhra Pradesh : షర్మిల పోటీపై వీడిన ఉత్కంఠ.. పార్లమెంట్ ఎన్నికల్లో సోదరుడిపై పోటీ..!

Andhra Pradesh : షర్మిల పోటీపై వీడిన ఉత్కంఠ.. పార్లమెంట్ ఎన్నికల్లో సోదరుడిపై పోటీ..!

మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక, ఏపీలోని 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ సీఈసీ ఫైనల్‌ చేసినట్టు ప్రచారం సాగుతోన్న అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే.. కడప-వైఎస్‌ షర్మిలా.. బాపట్ల-జేడీ శీలం.. కాకినాడ-పల్లంరాజు..

by Venu
manikkam Tagore on ys sharmila joining in congress

ఏపీలో జరగనున్న ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా సిద్దం అవుతున్నాయి.. ఎలా వీలైతే అలా.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ (Congress) చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) పోటీపై నెలకొన్న ఉత్కంఠకు మొత్తానికి తెరపడింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కడప (Kadapa) ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

ys sharmila is Fire on jagan governmentకడప సిట్టింగ్ ఎంపీ, ఆమె సోదరుడు అయిన వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy)ని ఢీకొట్టబోతున్నారు.. ఢిల్లీ (Delhi)లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు జరిగిన సీఈసీ మీటింగ్‌లో ఏపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులపై జోరుగా చర్చలు సాగాయి.. అనంతరం క్యాండిడేట్లను ఫైనల్ చేశారు. అదేవిధంగా మరో 58 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా అధిష్టానం పెండింగ్ పెట్టింది.

మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక, ఏపీలోని 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ సీఈసీ ఫైనల్‌ చేసినట్టు ప్రచారం సాగుతోన్న అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే.. కడప-వైఎస్‌ షర్మిలా.. బాపట్ల-జేడీ శీలం.. కాకినాడ-పల్లంరాజు.. రాజమండ్రి-గిడుగు రుద్రరాజు.. విశాఖపట్నం-సత్యా రెడ్డి.. ఏలూరు.. లావణ్య.. అనకాపల్లి-వేగి వెంకటేష్‌.. శ్రీకాకుళం-పరమేశ్వరరావు..

విజయనగరం-డీసీసీ ప్రెసిడెంట్ రమేష్‌ కుమార్.. రాజంపేట-నజీం అహమ్మద్.. చిత్తూరు-చిట్టిబాబు.. హిందూపూర్- షాహీన్.. నరసరావు పేట-అలెగ్జాండర్.. నెల్లూరు-దేవకుమార్ రెడ్డి.. ఒంగోలు-సుధాకర్ రెడ్డి.. మచిలీపట్నం-గొల్లు కృష్ణ పేర్లను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్టుగా సమాచారం..

You may also like

Leave a Comment