Telugu News » Arunachal Pradesh: చైనా కవ్వింపు చర్యలు… అరుణాచల్‌లో 30 ప్రాంతాలకు కొత్తపేర్లు..!!

Arunachal Pradesh: చైనా కవ్వింపు చర్యలు… అరుణాచల్‌లో 30 ప్రాంతాలకు కొత్తపేర్లు..!!

భారత్‌(Bharath)లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌(Arunachal Pradesh)తమదేనంటూ చైనా(Chaina) మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. అరుణాచల్‌లోని వివిధ ప్రాంతాలకు 30 కొత్త పేర్లతో లిస్టును తయారు చేసింది.

by Mano
Arunachal Pradesh: China's provocative actions... New names for 30 areas in Arunachal..!!

భారత్‌(Bharath)లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌(Arunachal Pradesh)తమదేనంటూ చైనా(Chaina) మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. అరుణాచల్‌లోని వివిధ ప్రాంతాలకు 30 కొత్త పేర్లతో లిస్టును తయారు చేసింది. ఈమేరకు వివరాలతో కూడిన ఒక లిస్టును చైనా పౌర వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో విడుదల చేశారంటూ ఆ దేశ అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో 13,000 అడుగుల ఎత్తైన సేలా టన్నెల్‌ను జాతికి అంకితమిచ్చారు.

Arunachal Pradesh: China's provocative actions... New names for 30 areas in Arunachal..!!

అప్పటి నుంచి భారత్‌పై చైనా నిప్పులు కక్కుతోంది. ఇంతకు ముందు అరుణాచల్‌లోని వివిధ ప్రాంతాలకు పేర్లు పెడుతూ మూడు లిస్టులను చైనా విడుదల చేయగా.. ఇది నాలుగోసారి కావడం గమనార్హం. చైనా ఇంతకుముందు కూడా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ మొదటి జాబితాను 2017లో చైనా పౌర వ్యవహారాల శాఖ విడుదల చేసింది. 2021లో అరుణాచల్‌లోని 15, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ రెండుసార్లు లిస్టులను విడుదల చేసింది.

ఇప్పుడు మరోసారి 30ప్రాంతాలకు పేర్లను ప్రకటించగా అందులో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు మే 1 నుంచి అరుణాచల్‌లోని ఆ 30 ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలని, చైనా సార్వభౌమాధికార హక్కులకు క్లెయిమ్ చేసుకునే ప్రదేశాల పేర్లను విదేశీ భాషలలో పిలవకూడదని తెలిపింది. వాటి పేర్లను విదేశీ భాషల నుంచి చైనీస్‌లోకి అనువదించకూడదని చైనా ఆ లిస్టులో పేర్కొంది.

అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా పదేపదే చేస్తున్న వాదనలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కొట్టిపారేశారు. చైనా చర్యలు హాస్యాస్పదమన్నారు. అరుణాచల్ అనేది భారతదేశంలోని భూభాగమే అని స్పష్టం చేశారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌ భారత భూభాగమే అంటూ ఇటీవల అమెరికా చేసిన ప్రకటనతో అగ్గి మీద గుగ్గిలమైన చైనా ఇప్పుడు 30 ప్రాంతాలకు పేర్లు పెట్టి అధికారికంగా విడుదల చేయడం చర్చనీయాంశమైంది. అరుణాచల్ ప్రదేశ్‌ను జాంగ్నాన్‌, దక్షిణ టిబెట్ అని పిలవడమే కాకుండా భారత్‌ భూభాగానికి చెందిన ప్రాంతాలకు పేర్లు కూడా పెట్టడం వల్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

You may also like

Leave a Comment