Telugu News » Andhra Pradesh : జ‌గ‌న్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే.. ఫలించిన ష‌ర్మిల వ్యూహం..!

Andhra Pradesh : జ‌గ‌న్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే.. ఫలించిన ష‌ర్మిల వ్యూహం..!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. ఏపీలో జగన్ టార్గెట్ గా షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ముందు చూపుతో జరిగాయని అంటున్నారు.

by Venu

దేశంలో ఎన్నికల నగారా మోగడటంతో పార్టీలన్నీ రంగంలోకి దిగి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి.. అయితే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు కనిపిస్తాయో అనే ఆసక్తి ఉత్కంఠంగా మారింది. ఒకవైపు గెలుపు తప్పని సరి అనే పరిస్థితుల్లో వైసీపీ (YCP).. అదేవిధంగా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)లతో ఇక్కడి పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉందంటున్నారు.

అయితే బలమైన ప్రత్యర్థిని తెలివితో, తెలివైన ప్రత్యర్థిని బలంతో కొట్టాలనేది యుద్ధనీతి.. ఆసాంతం ఈ యుద్ధనీతిని ఒంటపట్టించుకొన్న వైసీపీ అధినేత జగన్‌.. గడిచిన ఐదేళ్లలో రాజకీయంగా టీడీపీని, ఇతర ప్రధాన ప్రత్యర్థుల విషయంలో కీలకంగా వ్యవహరించారు.. కాస్త సంచలనంగా ప్రవర్తించారు అనే టాక్ ఉంది. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. ఏపీలో జగన్ టార్గెట్ గా షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ముందు చూపుతో జరిగాయని అంటున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం జగన్‌ (Jagan) సింగిల్ అవగా.. మూడు ప్రధాన పార్టీల కూటమి ఒకవైపు.. కాంగ్రెస్ (Congress) మరొక వైపు.. ఏపీలో అధికారం కోసం పావులు కదుపుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిరాశలో ఉన్న నేతలు కండువాలు మార్చడం కామన్ గా మారింది. ఈ క్ర‌మంలోనే నందికొట్కూర్ (Nandikotkur) వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధ‌ర్ (Arthur), కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల స‌మంక్ష‌లో ఆర్ధ‌ర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల ఆయ‌న‌కు కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన వైఎస్సార్‌సీపీ జాబితాలో ఆర్ధ‌ర్ పేరు లేదు. దీంతో ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు నందికొట్కూర్ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఆర్ధ‌ర్ అసెంబ్లీకి పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది..

You may also like

Leave a Comment