Telugu News » Kareena Kapoor: సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీపై కరీనా కపూర్ హింట్..!!

Kareena Kapoor: సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీపై కరీనా కపూర్ హింట్..!!

ప్రస్తుతం కరీనా ‘దిక్రూ'(The crew) అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా గురించి కరీనా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయాన్ని చెప్పుకొచ్చింది.

by Mano
Kareena Kapoor: Kareena Kapoor Hint on South Industry Entry..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్(Bollywood Star Heroine Kareena Kapoor) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఇప్పటి వరకు ఈ హీరోయిన్ ఎలాంటి సినిమాలు చేయకపోయినా అనేక ప్రకటనల్లో నటిస్తూ సౌత్‌లోనూ ఆమె బాగా పాపులర్ అయింది. పదేళ్లకు పైగా బాలీవుడ్‌లో రాణించిన ఈ హీరోయిన్‌ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి అడ్డుగుపెట్టేందుకు సిద్ధమైంది.

Kareena Kapoor: Kareena Kapoor Hint on South Industry Entry..!!

ప్రస్తుతం కరీనా ‘దిక్రూ'(The crew) అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా గురించి కరీనా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయాన్ని చెప్పుకొచ్చింది. ‘‘నేను త్వరలోనే ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నా.. ఓ స్టార్ హీరో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో నటించనున్నాను.’ అని తెలిపింది.

అంతేకాదు.. సౌత్‌తో తనకు ఇదే తొలి సినిమా అని, షూటింగ్‌లో పాల్గొనే సమయం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. రాజేష్ కృష్ణన్ తెరకెక్కించిన ఈ మూవీ ఈనెల 29న ఈ విడుదల కానుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా విడుదలైన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఎయిర్ హోస్టెస్‌లుగా ఈ ముగ్గురు హీరోయిన్లు ప్రయాణికుల వస్తువులను ఎలా దొంగిలిస్తారో ఈ సినిమాలో చూపించునున్నారు. కరీనా అంతేకాదు ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా రూపొందుతున్న కన్నడ చిత్రం ‘టాక్సిక్’లో కరీనా ఓ కీలక పాత్ర చేయనున్నారట.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే అధికారక వచ్చేవరకు ఆగాల్సిందే.

 

You may also like

Leave a Comment