ఇటీవల తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుతదాడి తీవ్రకలకలం రేపింది.అప్పటి నుంచీ అటవీశాఖా అధికారులు అప్రమత్తమై తమ వంతు రక్షణ చర్యలు చేపడుతూనే ఉన్నారు.
తాజాగా వారు పడ్డ శ్రమ ఫలించింది. తిరుమల నడకదారిలో అటవీశాఖ(Forest Department)అధికారుల చేతికి మరో చిరుత పులి చిక్కింది.4 ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు ట్రాప్ కెమెరాల(Trap cameras)నూ ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఓ చిరుత చిక్కగా…బాలికపై దాడిచేసిన ప్రాంతమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం (Lakshminarasimhaswamy Temple) సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో ఈరోజు(17.08.23)మరో చిరుత చిక్కింది.
వారం రోజుల వ్యవధిలో బోనులో రెండు చిరుతలు చిక్కడంతో అధికారులు…ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా తిరుపతిలో చిరుతల సంచారంతో శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులు బిక్కుబిక్కుమంటున్నారు.
ఇది ఇలా ఉండగా ఇటీవల శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో కూడా చిరుత సంచారం కలకలం రేపింది.ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల(SV Engineering College) వద్ద చిరుతను చూసిన విద్యార్థులు ఆందోళన చెంది..పరుగులు తీశారు.
వేద విశ్వవిద్యాలయంలోనూ రాత్రి సమయంలో చిరుత సంచరించినట్లు గుర్తించారు. దీనిపై అటవీ అటవీశాఖకు విద్యార్థులు సమాచారం అందించగా..అధికారులు దీనిపై పరిశీలనలు చేపట్టారు.