Telugu News » Anurag Singh Thakur : రాహుల్ ను ఓడించిన మహిళ నేత.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..!

Anurag Singh Thakur : రాహుల్ ను ఓడించిన మహిళ నేత.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..!

బీజేపీ అధికారంలోకి రావడానికి కంటే ముందు పదేళ్లు కాంగ్రెస్ (Congress) పాలించింది.. అప్పుడు మహిళ బిల్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో రాహుల్, ఒవైసీ ఎక్కడ ఉన్నారని అన్నారు..

by Venu
AP BJP: Visakha seat lost.. BJP ranks reached Delhi..!

పార్లమెంట్ ఎన్నికలు పొలిటికల్ హిట్ పుట్టిస్తున్నాయి.. విమర్శలతో నేతలు ఒకరి మీద ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకోవడం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ (Anurag Singh Thakur).. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్, ఎంఐఎంలపై ధ్వజమెత్తారు.. రాహుల్, ఓవైసి (Asaduddin Owaisi) ఔరంగజేబు స్కూల్ బ్యాచ్ అని ఎద్దేవా చేశారు.

సనాతన ధర్మాన్ని కాంగ్రెస్ ఖతం చేయాలని చూస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.. 15 నిమిషాలు టైం ఇచ్చి చూడండని అక్బరుద్దీన్ ఓవైసీ అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.. మరోవైపు గోవులను కొస్తూ తింటూ ఉండండని అసదుద్దీన్ ఒవైసీ మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. వీరి వ్యాఖ్యలపై రాహుల్, సోనియా ఎందుకు స్పందించరని ఠాకూర్ నిలదీశారు.

బీజేపీ అధికారంలోకి రావడానికి కంటే ముందు పదేళ్లు కాంగ్రెస్ (Congress) పాలించింది.. అప్పుడు మహిళ బిల్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో రాహుల్, ఒవైసీ ఎక్కడ ఉన్నారని అన్నారు.. రాహుల్ ను మా మహిళ నేత ఓడించిందని గుర్తు చేసిన కేంద్ర మంత్రి.. ఓవైసీ ఓటమి సైతం.. మహిళ చేతిలో ఖాయమని జోస్యం చెప్పారు. ఇది మంచికి చెడుకి మధ్య యుద్ధమని పేర్కొన్నారు..

మరోవైపు బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.. కవిత నిర్దోషి అయితే బెయిల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.. ఇక్కడ దోచుకుంది చాలక ఢిల్లీ వెళ్లి దోచుకోవాలని చూసిందని కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని తెలిపారు. అందుకే ప్రస్తుతం స్కామ్ లు చేసిన వారు జైల్ లో ఊచలు లెక్క పెడుతున్నట్లు పేర్కొన్నారు.. అదేవిధంగా అంబేద్కర్ కి కాంగ్రెస్ భారత రత్న కూడా ఇవ్వలేదు, సర్దార్ పటేల్ కు ఏం చేశారని నిలదీశారు.

రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని నడిపించిన సోనియా గాంధీ ఇప్పుడు కూడా అదే పని చేస్తుందని ఆరోపించిన అనురాగ్ సింగ్ ఠాకూర్.. దేశ వ్యాప్తంగా 40 సీట్లలో గెలవడానికే కాంగ్రెస్ తిప్పలు పడుతుందని ఎద్దేవా చేశారు..

You may also like

Leave a Comment