Telugu News » CM Jagan : హైదరాబాద్ ను కోల్పోయాం…. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం…!

CM Jagan : హైదరాబాద్ ను కోల్పోయాం…. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం…!

గత ప్రభుత్వ విధానాల వల్ల బాగా నష్టం జరిగిందని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

by Ramu
ap cm ys jagan speech in assembly about hyderabad

ఏపీ అసెంబ్లీ (Assembly)లో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan)సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల బాగా నష్టం జరిగిందని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో హైదరాబాద్‌ (Hyderabad)ను కోల్పోయామని, ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు.

ap cm ys jagan speech in assembly about hyderabad

60 ఏళ్లుగా కష్టపడి హైదరాబాద్‌ లాంటి నగరాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. కానీ దానిని కోల్పోయామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం తగ్గిపోయిందని అన్నారు. ప్రతి రాష్ట్రానికి ఓ ఎకనామిక్‌ పవర్‌ హౌస్‌ ఉండాలన్నారు. ప్రతిరాష్ట్రానికి ఓ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలని పేర్కొన్నారు.

అందుకే తాను పదే పదే విశాఖపట్నం ప్రస్థావన తీసుకు వస్తానని చెప్పారు. గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయని ఆరోపించారు. రాష్ట్రం ప్రతి ఏడాది రూ.13వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోతోందని వివరించారు. రాష్ట్రానికి ఒక ఎకనామిక్‌ పవర్‌ హౌజ్‌ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర తలసరి ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందన్నారు.. అందుకే వైజాగ్‌ గురించి పదే పదే చెబుతున్నానని వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలంటే పెద్ద పెద్ద నగరాలు అవసరమన్నారు.

You may also like

Leave a Comment