Telugu News » Mutyala Naidu : భయంతోనే పొత్తులు..!

Mutyala Naidu : భయంతోనే పొత్తులు..!

బాబుకు ప్రస్తుతం భయం పట్టుకుందని పేర్కొన్నారు. అందుకే పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.

by Ramu
ap deputy cm mutyala naidu comments on chandrababu and lokesh

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu)పై ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు( Mutyala Naidu) నిప్పులు చెరిగారు. చంద్రబాబు నైతిక విలువలు లేని వ్యక్తి అంటూ తీవ్రంగా మండిపడ్డారు. బాబుకు ప్రస్తుతం భయం పట్టుకుందని పేర్కొన్నారు. అందుకే పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. పందులు గుంపుగా వస్తే.. సింహం (సీఎం వైఎస్‌ జగన్‌) సింగిల్‌గా వస్తాడని చెప్పారు.

ap deputy cm mutyala naidu comments on chandrababu and lokesh

సింహం లాగా జగన్ జూలు విదిల్చితే.. ఇతర పార్టీలు అన్నీ బంగాళాఖాతంలో కలిసిపోతాయని అన్నారు. శ్రీ కాకుళంలో మీడియాతో ముత్యాల నాయుడు మాట్లాడుతూ… సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో సంక్షేమ, అభివృద్ధి పాలన అందిస్తున్నామని తెలిపారు. గతంలో పాఠశాలలు పెచ్చులు ఊడిపోయేవని అన్నారు.

కానీ ఇప్పుడు గ్రానైట్ పలకలతో గదులు సిద్ధం చేశామని వివరించారు. టీడీపీ వ్యతిరేకించినా విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం నేర్పిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్ సభలకు, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సభలకు ఉన్న ప్రజా స్పందనను గమనించాలని ప్రజలకు సూచించారు. మాట ఇచ్చిన తరువాత వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకే చెల్లిందని ఆయన దుయ్యబట్టారు.

గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోపీడీ చేసే పరిస్థితి ఉండేదని ఆరోపణలు గుప్పించారు.. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో అలంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అసలు, చంద్రబాబు అంత బలంగా ఉంటే ఎందుకు జనసేన పార్టీలో, బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సొంత కూతురుని ఇస్తే.. మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చోవడానికి బాలయ్య, ఆయన కటుంబ సభ్యులు ఏవిధంగా సహకరించారో అందరికీ తెలుసన్నారు.
పూర్తి కథనం..

You may also like

Leave a Comment