Telugu News » AP Elections: ఎన్నికల్లో ప్రచారానికి తెలంగాణ మంత్రులు..!

AP Elections: ఎన్నికల్లో ప్రచారానికి తెలంగాణ మంత్రులు..!

ఆంధ్రప్రదేశ్‌(Ap) ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) తరఫున ప్రచారం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను రంగంలోకి దించుతోంది పార్టీ అధిష్టానం. ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

by Mano
AP Elections: Telangana ministers to campaign in elections..!

ఆంధ్రప్రదేశ్‌(Ap)లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) తరఫున ప్రచారం చేసేందుకు పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను రంగంలోకి దించుతోంది. ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముందస్తు ప్రచారానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

AP Elections: Telangana ministers to campaign in elections..!

ఏపీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల(APCC Chief YS Sharmila) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ప్రజలను పూర్తిగా ప్రసన్నం చేసుకునేందుకు అధిష్టానం తెలంగాణ మంత్రులు, సీనియర్‌ నాయకుల సేవలను వాడుకోవాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా చేసిన అనుభవం ఉన్న నేతలతో ఏపీలో ప్రచారం నిర్వహించనుంది.

ఏపీలోని పాత తరం నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో వారికి ఉన్న గుర్తింపు ఉపయోగపడుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే నోటిఫికేషన్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎన్నికలు ఒకేసారి వస్తే మొదటి వారంలోనే తెలంగాణ నేతల సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేర్వేరు దశల్లో వస్తే పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనే యోచనలో పార్టీ ఉంది.

అయితే, సీఎం రేవంత్‌రెడ్డిని స్టార్‌ క్యాంపెనర్‌గా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్‌లో రేవంత్‌రెడ్డితో ప్రచారం చేయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ త్వరలో ఏపీలో పర్యటించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో ఆమె భేటీ అవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చిస్తున్నట్లు సమాచారం.

You may also like

Leave a Comment