Telugu News » Attack on a British ship: మళ్లీ రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. బ్రిటన్ నౌకపై దాడి..!

Attack on a British ship: మళ్లీ రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. బ్రిటన్ నౌకపై దాడి..!

హౌతీరెబల్స్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌(Gulf of Eden)లో శుక్రవారం మరోసారి దాడులకు పాల్పడ్డారు. ఆయిల్ ట్యాంకులతో వెళుతున్న బ్రిటన్‌కు చెందిన నౌకపై క్షిపణితో దాడి చేశారు.

by Mano
Attack on a British ship: The Houthi Rebels, who are agitated again.. Attack on a British ship..!

యెమెన్‌(Yemen)కు చెందిన హౌతీ రెబల్స్(Houthi Rebels) మరింత రెచ్చిపోతున్నారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌(Gulf of Eden)లో నౌకలపై శుక్రవారం మరోసారి దాడులకు పాల్పడ్డారు. ఆయిల్ ట్యాంకులతో వెళుతున్న బ్రిటన్‌కు చెందిన నౌకపై క్షిపణితో దాడి చేశారు. మరోవైపు అమెరికా గస్తీ నౌకపై కూడా మిస్సైల్ దాడి(Missile attack) చేశారు.

Attack on a British ship: The Houthi Rebels, who are agitated again.. Attack on a British ship..!

దీంతో మార్లిన్‌ లాండ నౌకలోని కార్గో ట్యాంకులో మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటన సౌత్ ఈస్ట్ ఎడెన్‌కు 60 నాటికల్ మైళ్ల దూరంలో జరిగినట్లు సమాచారం. అయితే, ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదని నౌక ఆపరేటర్ తెలిపారు.

దాడి జరిగిన వెంటనే యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో మోహరించినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. అదేవిధంగా ఈమార్గంలో వెళ్తున్న నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు హుతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన ఒక క్షిపణిని తమ యుద్ధ నౌకలు కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ ప్రదర్శన ప్రకటించింది.

మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో గస్తీ తిరుగుతున్న అమెరికా యుద్ధనౌక ఈఎస్‌ఎస్ కార్నేపై హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం క్షిపణిని ప్రయోగించారు. దీన్ని తమ బృందం కూల్చివేశాయని అమెరికా మిలిటరీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎర్రసముద్రంలో అమెరికా నౌకను డైరెక్ట్‌గా టార్గెట్ చేయడం ఇదే తొలిసారి.

ఈ పరిణామాల మధ్య ఇరాన్‌ను చైనా హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నౌకలపై దాడులు ఆపకపోతే ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు తెంచుకునేందుకు డ్రాగన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్ సహా పశ్చిమదేశాలకు చెందిన నౌకలపై హౌతీ రెబెల్స్‌ ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో దాడులు జరుగుతున్నాయి.

You may also like

Leave a Comment