టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chief Chandrababu)పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును నెత్తిన పెట్టుకుంటే మళ్ళీ రాష్ట్ర పదేళ్లు వెనక్కి పోతుందని విమర్శించారు. చిత్తూరు జిల్లా(Chittoor District) పుంగనూరు(Punganur)లో మంత్రి పెద్దిరెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి, మోసం చేశారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై స్పందించారని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు చూస్తే, ఏడాదికి రూ.2లక్షల కోట్లు అవసరమవుతాయని, అసలు ఇది సాధ్యమేనా? అని ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రూ.14,200కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయని, నేడు వాటి వడ్డీలతో కలిపి రూ.25వేల కోట్లకు చేరిందన్నారు. మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. బాబు హయాంలో జన్మభూమి కమిటీలు దొచుకున్నాయంటూ ధ్వజమెత్తారు.
సీఎం వైఎస్ జగన్ పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. మాటపై ఎవరు నిలబడతారో ప్రజలు ఆలోచించాలన్నారు. సొంత మామను వెన్నుపోటు పొడవడమే గాక అధికారంలోకి వచ్చాక ప్రజలనూ మోసం చేశాడంటూ ఆరోపణలు చేశారు.