ఏపీ ఎన్నికల ప్రచారంలో అన్న చెల్లి మధ్య మాటలు పొయ్యిలో ఉప్పు వేసినట్లుగా పేళుతుండటం కనిపిస్తోంది. అసలు షర్మిల టార్గెట్ ఏంటనేది ఇప్పటి వరకు అంతుచిక్కని రహస్యంగా ఉందని చర్చించుకొంటున్నారు.. జగన్ ఓటమి కోసం పని చేస్తున్నారా ? అనే అనుమానాలు సైతం లేవనెత్తుతున్నారు.. మొత్తానికి ఏపీ ప్రజలు ప్రస్తుతం అయోమయంలో ఉన్న వేళ ఒక ఆసక్తికర ఘటన తెరమీదికి వచ్చింది.

అలాగే తన అన్న జగన్ వద్ద రూ. 82.58 కోట్లు, వదిన వైఎస్ భారతి రెడ్డి వద్ద రూ. 19.56 కోట్లు అప్పులు తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ అంశం రాజకీయ వర్గాలలో చర్చాంశనీయంగా మారింది. జగన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూనే షర్మిల అప్పు తీసుకొన్నట్లు పేర్కొనడం పలు అనుమానాలు కలిగిస్తుందని అనుకొంటున్నారు.. అయినా రాజకీయంగా తీవ్ర స్థాయిలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుందన్న విషయం అందరికి తెలిసిందే..
మరి ఇంత విరోధులుగా ఉన్న జగన్ (Jagan) ఎందుకు డబ్బులు ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా అంత పెద్ద మొత్తంలో జగన్ వద్ద డబ్బులు ఎక్కడివి అని రాష్ట్రంలో చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. అయిన రాజకీయాల్లో బయటి వారే బండ బూతులు తిట్టుకొని కలిసి పోతుండటం కామన్ గా మారింది. అలాంటిది. ఒకే రక్తం పంచుకొన్న వీరిమధ్య ఉన్న వైరం కేవలం రాజకీయ స్టంట్ అని కొందరు ఆరోపిస్తున్నారు..