Telugu News » Etala Rajender : కేసీఆర్ చేసిన తప్పులు రిపీట్ చేస్తున్న రేవంత్.. చివరకు అధోగతి ఖాయం..!

Etala Rajender : కేసీఆర్ చేసిన తప్పులు రిపీట్ చేస్తున్న రేవంత్.. చివరకు అధోగతి ఖాయం..!

అధికారం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చారని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక గ్యారెంటీల అమలులో విఫలమైందని విమర్శించారు..

by Venu
etala rajender made hot comments on brs and congress

తెలంగాణ (Telangana)లో వాతావరణం కూల్ గా మారింది. కానీ పొలిటికల్ వార్ మాత్రం హిట్ పెరిగేలా చేస్తుంది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో పాల్గొన్న నేతలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం.. ఎవరికి వారే తమ పార్టీ గురించి గొప్పలు చెప్పుకోవడం కనిపిస్తోంది. ఇక ఎంపీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు..

etala rajenders sensational remarks in mudirajs Atma gourava sabhaఈ నేపథ్యంలో మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Etala Rajender).. రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన తప్పులే ప్రస్తుతం ఉన్న సీఎం చేస్తున్నారని ఆరోపించారు.. ఇతర పార్టీ నాయకులను కొనాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు.. రాజకీయ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని మండిపడ్డారు..

ఇలాంటి రాజకీయాలు ఎక్కువ రోజులు నిలబడవని పేర్కొన్న ఈటల.. చివరికి కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి పడుతుందని హెచ్చరించారు. అధికారం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చారని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక గ్యారెంటీల అమలులో విఫలమైందని విమర్శించారు.. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే వృధా అవుతోందని వెల్లడించారు..

మరోవైపు కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ నెక్స్ట్ పీఏం అని ఢంకా బజాయించుకొంటున్న పార్టీ నేతలు.. అసలు ఈ జన్మలో ఆయన ప్రధాని కాలేరన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP) 400 సీట్లు సాధించి హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి భారత ప్రధాని మోడీ (Modi) అని జోస్యం చెప్పారు..

You may also like

Leave a Comment