Telugu News » AP : వైసీపీ టార్గెట్ చిరంజీవి.. ఎందుకిలా..?

AP : వైసీపీ టార్గెట్ చిరంజీవి.. ఎందుకిలా..?

చిరంజీవిని టార్గెట్ చేసుకోవడం పై పవన్ తో పాటు చంద్రబాబు స్పందించారు. చివరకు వైసీపీ (YCP)ని అభిమానించే మెగా అభిమానులు సైతం ఆలోచనలో పడ్డారు.

by Venu

ఏపీ (AP)రాజకీయాలు రోజుకో తీరుగా మారడం కనిపిస్తుంది. అధికార పార్టీ నేతలు చేసే విమర్శలు ఎప్పుడు ఎవరివైపు తిరుగుతాయో తెలియడం లేదంటున్నారు.. ఇక ఎన్నికల ప్రచారంలో అయితే మాటల్లో వేడి తగ్గడం లేదు.. తాజాగా ఈ గాలి చిరంజీవి వైపు మళ్ళినట్లు తెలుస్తోంది. ఆయన ఓ ఇద్దరు సన్నిహిత నేతలను ఆశీర్వదించారు. వారిని గెలిపించాలని కోరారు. దీంతో వైసీపీ శ్రేణులు చిరంజీవిని టార్గెట్ చేసుకున్నారని ప్రచారం మొదలైంది.

ఇందుకు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali)ని వేపన్ గా వాడుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఆయన రంగంలోకి దిగి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చివరకు సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఎవరు వచ్చినా పర్వాలేదు.. సింహం సింగిల్ గా వస్తుందని.. చిరంజీవిని అవమానించేలా మాట్లాడారు. అయితే ఈ అంశంపై పవన్ న్యూక్లియర్ బాంబ్ లా రియాక్ట్ అయ్యారు. గతాన్ని తెరమీదికి తెచ్చారు..

మూడు రాజధానుల అంశం విషయంలో చిరంజీవి (Chiranjeevi) గతంలో జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. అప్పట్లో ఆయనను ఓన్ చేసుకోవడంలో వైసీపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు మించి జగన్ ను సోదరుడిలా భావిస్తున్నారని ఊరువాడ ప్రచారం చేశారు. చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చలు జరిపినప్పుడు సైతం తమకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారనే టాక్ వచ్చింది.

అయితే ఇప్పుడు చిరంజీవిని టార్గెట్ చేసుకోవడం పై పవన్ తో పాటు చంద్రబాబు స్పందించారు. చివరకు వైసీపీ (YCP)ని అభిమానించే మెగా అభిమానులు సైతం ఆలోచనలో పడ్డారు. అందుకే దిద్దుబాటు కోసం సజ్జల మీడియా ముందుకు వచ్చారు. చిరంజీవిపై తమకు ఎటువంటి కోపం లేదని.. బ్యాంకులను మోసం చేసే వ్యక్తిని పక్కన పెట్టుకుని మాట్లాడారని.. అందుకే స్పందించాల్సి వచ్చిందని సంజాయిషీ ఇచ్చారు..

You may also like

Leave a Comment