Telugu News » CM Revanth : బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే..!

CM Revanth : బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే..!

బీజేపీ నాయకులు గెలిచి కేంద్ర మంత్రులయినా హైదరాబాద్ కు చేసిందేంటని ప్రశ్నించిన రేవంత్.. వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమయితే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నగరానికి చిల్లి గవ్వ తేలేదని ఆరోపించారు..

by Venu
CM Revanth

అధికార కాంగ్రెస్‌ (Congress) పార్టీ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. మిషన్‌-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్‌ (Secunderabad)లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.

cm revanth reddy handed over appointment documents to nursing officersఆనాడు దత్తాత్రేయని ఓడించి.. అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ లో మూడు రంగుల జెండా ఎగరేశారు.. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. మళ్లీ 20ఏళ్ల తరువాత ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి దానం నాగేందర్ మూడు రంగుల జెండా ఎగిరేయబోతున్నారు.. అలాగే సికింద్రాబాద్ లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు..

బీజేపీ నాయకులు గెలిచి కేంద్ర మంత్రులయినా హైదరాబాద్ కు చేసిందేంటని ప్రశ్నించిన రేవంత్.. వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమయితే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నగరానికి చిల్లి గవ్వ తేలేదని ఆరోపించారు.. జంట నగరాల్లో మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ అని పేర్కొన్నారు.. మరోవైపు పద్మారావు పరువు తీసేందుకే కేసీఆర్ పోటీకి దింపారని తెలిపిన రేవంత్.. ఆయన నామినేషన్ కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

సికింద్రాబాద్ సీటును కేసీఆర్ బీజేపీ కి తాకట్టు పెట్టారని దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చన్నారు.. బస్తీల్లో ప్రజల కష్టాలు తీరాలంటే సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ ను గెలిపించాలని కోరారు.. ప్రభుత్వం మనది.. సంక్షేమం మనది…ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం చేసే బాధ్యత మాదని సీఎం హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని విమర్శించారు.

You may also like

Leave a Comment