Telugu News » Accident : కీలక మలుపు తిరిగిన మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసు.. పంజాగుట్ట పోలీసులపై అనుమానాలు..!!

Accident : కీలక మలుపు తిరిగిన మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసు.. పంజాగుట్ట పోలీసులపై అనుమానాలు..!!

గతంలో సోహైల్‌ చేసిన మరో నిర్వాకం బయటపడింది. రోడ్ నెం 45లో చేసిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. మరొకరు ఇప్పటికీ చావుబతుకుల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.. అప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే, తన కొడుకుని తప్పించి మరొకరిని కేసులో ఇరికించినట్టు తెలిసింది..

by Venu

చట్టం ఎవరికి చుట్టం కాదంటారు.. కానీ రాజకీయ నాయకులు చట్టాన్ని చాపలా మలచి వాడుకొంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.. ఇందుకు ఉదాహరణలు సైతం ఎన్నో ఉన్నా.. ప్రస్తుతం బేగంపేట (Begumpet) ప్రజాభవన్‌ (Praja Bhavan) వద్ద కారు ఘటన కూడా సాక్ష్యంగా నిలిచిందని అంటున్నారు.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సోహైల్ ని కాపాడే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి..

నిన్నటి వరకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సోహైల్ స్థానంలోకి మాజీ ఎమ్మెల్యే పని మనిషి ఎంట్రీ ఇచ్చాడు.. అయితే ఈ డ్రామా వెనుక పంజాగుట్ట (Panjagutta) పోలీసులు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతోన్నాయి.. సోహైల్‌ను ఈ కేసు నుంచి తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే(Ex MLA)తో కలిసి పంజాగుట్ట పోలీసులు కుట్ర పన్నినట్టుగా విచారణలో వెల్లడైందని సమాచారం..

ప్రమాద సమయంలో సోహైల్ మద్యం తాగి కారు నడిపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అరెస్ట్ అయిన కొడుకు కోసం మాజీ ఎమ్మెల్యే షకిల్ రాత్రి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు రావడంతో ఇప్పుడు ఈ కేసు రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. దీంతో ఈ యాక్సిడెంట్ (Accident) వ్యవహారం పై సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. కాగా సోహైల్ అరెస్ట్ అనంతరం మాజీ ఎమ్మెల్యే పోలీసు స్టేషన్‌కు వచ్చి వెళ్లినట్టు సీసీటీవీలో రికార్డయింది.

సీసీ పూటేజీ ఆధారంగా ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై అనుమానం కలిగిన పోలీసులు.. దర్యాప్తు మొదలు పెట్టారు.. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ దుర్గారావు అస్వస్థకు గురైనట్టు సమాచారం. ఇదే సమయంలో గతంలో సోహైల్‌ చేసిన మరో నిర్వాకం బయటపడింది. రోడ్ నెం 45లో చేసిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. మరొకరు ఇప్పటికీ చావుబతుకుల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.. అప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే, తన కొడుకుని తప్పించి మరొకరిని కేసులో ఇరికించినట్టు తెలిసింది..

You may also like

Leave a Comment