Telugu News » Aravind kejreewal: సీఎం అరెస్ట్‌పై స్పందించిన అమెరికా విదేశాంగ ప్రతినిధి..!

Aravind kejreewal: సీఎం అరెస్ట్‌పై స్పందించిన అమెరికా విదేశాంగ ప్రతినిధి..!

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్(Delhi CM Aravind Kejreewal) అరెస్ట్‌పై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

by Mano
Arvind Kejriwal: Rejection of Kejriwal's petition.. Huge fine..!!

భారత్ అంతర్గత వ్యవహారాలపై అమెరికా తరచూ తలదూరుస్తోంది. ఇటీవల మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్(Delhi CM Aravind Kejreewal) అరెస్ట్‌పై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ అరెస్టును ఖండించడంతో పాటు సమానుకూల న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

Aravind Kejreewal: US foreign representative reacted to CM's arrest..!

అయితే, ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. బుధవారం 45నిమిషాల పాటు విదేశాంగ శాఖ విచారణ చేపట్టింది. అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ పెద్ద ఎత్తున అభ్యంతరాలను తెలిపింది. తాజాగా అమెరికా విదేశాంగ ప్రతినిధికి సామాన్లు జారీ చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పందించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ సకాలంలో జరగాలని, అదేవిధంగా పారదర్శకంగా జరగాలని ఆశిస్తున్నట్లు అమెరికా చెప్పిందే చెప్పుకొచ్చింది.

అరవింద్ క్రేజీవాల్ అరెస్టును సహా అనేక చర్యలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని.. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తెలిపారు. ఈ విషయానికి సంబంధించి ఢిల్లీలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా పనిచేస్తున్న గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేయడంతో యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను స్తంభించడంపై కూడా అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతల ఖాతాలకు సంబంధించి ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు వారి ఖాతాలను స్తంభింపజేశారన్న ఆరోపణలపై తమకు అవగాహన ఉందని, ఇలా చేయడం వల్ల వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ప్రచారానికి సవాల్‌గా మారవచ్చని ఆయన పేర్కొన్నారు.

You may also like

Leave a Comment