Arrest’: మంచి విద్య, చక్కగా చదువుకుంటూ ఉన్నతోద్యోగం చేయవలసిన వాడు..పెడదారి పట్టాడు. అసభ్యకరమైన చేష్టలకు దిగాడు. మరి సినిమాలు గానీ, సీరియళ్లు గానీ అతనిమీద ప్రభావం చూపాయో తెలియదు. సినిమాలు, సీరియళ్లు కేవలం వినోదాన్ని అందించడానికే అన్న విషయాన్ని మరిచి ఓ క్రిమినల్ లా మారాడు. కోచ్చి లోని ఓ యువకుని ఉదంతమే ఇది. అభిమన్యు అనే ఇతగాడు రోబోటిక్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. పైగా ఈ సిటీలో ఓ సంస్థలో పని చేస్తున్నాడు కూడా.
. కానీ ఎందుకో తెలియదు. ఓ రోజు ముస్లిం మహిళలా బుర్ఖా ధరించి ఓ మాల్ లోకి ప్రవేశించాడు. మహిళల వాష్ రూమ్ లోకి ప్రవేశించడమే గాక.. అక్కడికి దగ్గరలోని ఓ బాక్సులో తన ఫోన్ ని ఉంచి వీడియోలు తీయడం ప్రారంభించాడు. ఎన్ని రోజుల నుంచి ఇలా చేస్తున్నాడో తెలియదు గానీ ఇతడి వ్యవహారంపై మాల్ సిబ్బందికి అనుమానాలు కలిగాయి.
వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాల్ కి చేరుకుని ఇన్వెస్టిగేట్ చేయడంతో అసలు విషయం బయట పడింది. 23 ఏళ్ళ అభిమన్యు.. చేస్తున్న ఈ యవ్వారాన్ని పోలీసులు తెలుసుకున్నారు. అతడ్ని అరెస్ట్ చేశారు
. అతని ఫోన్ ని, బుర్ఖాను స్వాధీనం చేసుకున్నారు. అభిమన్యు లోగడ కూడా ఇలాంటి పాడు పనులు చేశాడా అని దర్యాప్తు మొదలు పెట్టారు. పోలీసులు అరెస్టు చేయడంతో ఇతని ఉద్యోగానికి కూడా ‘ముప్పు’ తలెత్తింది. సదరు సంస్ధ యాజమాన్యం ఇతని విషయంలో ఏం చేయాలా అని ఆలోచిస్తోంది.