Telugu News » Arvind Kejriwal : కస్టడీ నుంచి సీఎం కేజ్రీవాల్‌ పరిపాలన.. అంతా ఉత్తదేనా..?

Arvind Kejriwal : కస్టడీ నుంచి సీఎం కేజ్రీవాల్‌ పరిపాలన.. అంతా ఉత్తదేనా..?

మరోవైపు కస్టడీ నుంచే సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పరిపాలన మొదలుపెట్టారని ఢిల్లీ నీటి పారుదల శాఖ మంత్రి ఆతిశీ (Atishi) నిన్న మీడియా ముఖ్యంగా వెల్లడించారు.. దేశ రాజధానిలో నీటి సరఫరాకు సంబంధించి ఉత్తర్వులను ఆయన జారీ చేశారని తెలిపారు..

by Venu
Delhi Liquor Case: Kejriwal again silent on ED inquiry..!

ఢిల్లీ (Delhi) లిక్కర్ పాలసీ స్కామ్‌ కేసులో (Liquor Policy Scam) అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Kejriwal) ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో మూడు రోజులుగా విచారణ కొనసాగిస్తున్న ఈడీ అధికారులు.. ఇప్పటికే ఆయనను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు జైల్‌లో నుంచే ముఖ్యమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు..

Arvind Kejriwal Ed Enquiry: Kejriwal ready for ED enquiry.. But one condition..!!మరోవైపు కస్టడీ నుంచే సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పరిపాలన మొదలుపెట్టారని ఢిల్లీ నీటి పారుదల శాఖ మంత్రి ఆతిశీ (Atishi) నిన్న మీడియా ముఖ్యంగా వెల్లడించారు.. దేశ రాజధానిలో నీటి సరఫరాకు సంబంధించి ఉత్తర్వులను ఆయన జారీ చేశారని తెలిపారు.. అంతే కాకుండా కేజ్రీవాల్‌ పేరిట ఆదేశాలు జారీచేసినట్లు ఉన్న నోట్ మీడియాకు చూపించారు.

ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొన్న ఈడీ.. కేజ్రీవాల్‌కు కంప్యూటర్‌ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని వెల్లడించింది. అలాంటప్పుడు ఆయన ఆదేశాలేవీ జారీ చేసే అవకాశమే లేదని స్పష్టం చేసింది. అయితే వీటికి సంబంధించిన ఆదేశాలు ఎలా బయటకు వెళ్లాయో తెలుసుకొనేందుకు సిద్దం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆప్‌ మంత్రి ఆతిశీ మార్లీనాను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు జైల్లో కేజ్రీవాల్‌ కదిలికలను గమనించేందుకు సీసీ టీవీ దృశ్యాలను సైతం పరిశీలించాలానే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహించాలని సంకల్పించింది. ఇందుకు ఢిల్లీ రామ్‌లీలా మైదానాన్ని వేదికగా చేసుకొంది. మార్చి 31న సుమారుగా 1.5 లక్షల మందితో భారీ సభను ఏర్పాటు చేయడానికి ఆమ్‌ఆద్మీ పార్టీ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టినట్లు టాక్ వస్తుంది.

You may also like

Leave a Comment