Telugu News » Harish Rao: రజాకార్లను తలపించేలా కాంగ్రెస్ పాలన: హరీశ్‌రావు

Harish Rao: రజాకార్లను తలపించేలా కాంగ్రెస్ పాలన: హరీశ్‌రావు

రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పాలన రజాకార్ల(Razakar)ను తలపిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతుల(Farmers) పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

by Mano
Are you coming to Gunpark tomorrow morning, Revanth Reddy.. I am Siddhamanna Harish Rao!

రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పాలన రజాకార్ల(Razakar)ను తలపిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతుల(Farmers) పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రైతులు సాగునీరు(irrigation water) లేక అల్లాడుతున్నారని అన్నారు.

Harish Rao: Congress rule to look like Rajakars: Harish Rao

రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం రుణమాఫీపైనే పెడతానని చెప్పిన సీఎం రేవంత్‌ అధికారంలోకి వచ్చి వంద రోజులైనా ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం సిగ్గుచేట్టన్నారు. ఓవైపు పంటలు ఎండిపోయి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పంటలు ఎండిపోతుంటే రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగం సాగునీరు లేక.. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు.

ఇతర పార్టీల నుంచి చేరికలపై తప్ప రైతుల గురించి ఆయనకు ఆలోచన లేదని అసహనం వ్యక్తం చేశారు. రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకు అధికారులు అప్పుల గురించి నోటీసులు పంపించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. బకాయిలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరించే పరిస్థితిని చూస్తుంటే రజాకార్ల పాలన గుర్తుకొస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు.

You may also like

Leave a Comment