Telugu News » Assembly Elections 2023 : ఏకాదశి సెంటిమెంట్.. ఈరోజు నామినేషన్ వేసింది వీరే..!!

Assembly Elections 2023 : ఏకాదశి సెంటిమెంట్.. ఈరోజు నామినేషన్ వేసింది వీరే..!!

ఈ రోజు ఏకాదశి (Ekadashi) కూడా ఉండటం వల్ల మంచిదనే సెంటిమెంట్ నేతల్లో ఉంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.. వాస్తవానికి ఈ నెల 3న అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) నోటిఫికేషన్ వెలువడగా.. అప్పటి నుంచి నామినేషన్లు అంతంత మాత్రంగా దాఖలు అయినాయి. కానీ చివరి రోజు మాత్రం పార్టీలోని కీలక వ్యక్తులు సైతం నామినేషన్ కోసం పరుగులు తీశారు.

by Venu

రాజకీయ నాయకులకు ప్రజల విషయంలో తప్ప.. పర్సనల్ విషయంలో మంచి రోజులను చూసుకోవడంలో ఎప్పుడు ముందు ఉంటారని జనం అనుకుంటున్నారు.. నేతలు చేసే ప్రతి పనికి ముహూర్తాలు చూసుకోవడం అలవాటుగా మారిందని అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు శుక్రవారంతో నామినేషన్ల గడువు పూర్తి అవుతుంది. అందుకే గురువారం వివిధ పార్టీల కీలక నేతలు, పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.

అందులో ఈ రోజు ఏకాదశి (Ekadashi) కూడా ఉండటం వల్ల మంచిదనే సెంటిమెంట్ నేతల్లో ఉంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.. వాస్తవానికి ఈ నెల 3న అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) నోటిఫికేషన్ వెలువడగా.. అప్పటి నుంచి నామినేషన్లు అంతంత మాత్రంగా దాఖలు అయినాయి. కానీ చివరి రోజు మాత్రం పార్టీలోని కీలక వ్యక్తులు సైతం నామినేషన్ కోసం పరుగులు తీశారు.

మరోవైపు బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత, కేసీఆర్ (KCR) గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ వేశారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ (KTR) సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు (Harish Rao) నామినేషన్ దాఖలు చేశారు.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.. ఎల్‌బినగర్ బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి.. సూర్యాపేటలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి.. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్.. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. మధిరలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కమల్‌రాజ్ నామినేషన్ దాఖలు చేశారు..

మరోవైపు స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కడియం శ్రీహరి నామినేషన్ వేశారు.. కాగా కాంగ్రెస్ కీలక నేతలు కూడా ఈ రోజునే నామినేషన్ పక్రియ మొదలుపెట్టారు. వారిలో మధిర నుంచి భట్టి.. హుజుర్‌నగర్‌లో ఉత్తమ్.. వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ నామినేషన్ వేశారు. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల అభ్యర్థుల భారీ ఎత్తున నామినేషన్లు సమర్పించారు.

ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాకలో కత్తిపోటుకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో దుబ్బాకకు వెళ్లి నామినేషన్ వేశారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఈ రోజునే నామినేషన్ వేశారు. ఇలా రేపటి వరకు ఆగకుండా దాదాపుగా అభ్యర్థులందరు నామినేషన్ పక్రియ పూర్తి చేశారు..

మరోవైపు బీజేపీ అభ్యర్థులు కూడా ఈ రోజు నామినేషన్ పక్రియకు శ్రీకారం చుట్టారు. వారిలో చింతల రామచంద్రా రెడ్డి ఖైరతాబాద్‌ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​, హుజురాబాద్ లో నామినేషన్​ వేశారు. అందెల శ్రీరాములు యాదవ్ మహేశ్వరం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ధర్మపురి బీజేపీ అభ్యర్థిగా ఎస్​.కుమార్ నామినేషన్ వేశారు.

You may also like

Leave a Comment