Telugu News » సలార్ మూవీకి అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసిన.. ఆ కుర్రాడు ఎవరో తెలుసా..?

సలార్ మూవీకి అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసిన.. ఆ కుర్రాడు ఎవరో తెలుసా..?

'సలార్' సినిమాకి ఎడిటర్ గా పనిచేసిన ఈ తెలంగాణ కుర్రాడు ఎవరంటే ?

by Sravya
'సలార్' సినిమాకి ఎడిటర్ గా పనిచేసిన ఈ తెలంగాణ కుర్రాడు ఎవరంటే ?

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమాలో ఒక కుర్రాడు గురించి వార్తలొస్తున్నాయి. టాలెంట్ కి వయసు కి అస్సలు సంబంధం లేదు చాలా సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది. చాలామంది ఒక్కొక్క రంగం మీద దృష్టి సారిస్తూ టాలెంట్ ని బయటపెడుతూ ఉంటారు. తెలంగాణ కుర్రాడు గురించి ఇప్పుడు ప్రస్తుతం ఒక వార్త వచ్చింది. టాలెంట్ తో ఏకంగా పాన్ ఇండియా హీరో మూవీలో అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసే అవకాశాన్ని సంపాదించుకున్నాడు ఈ కుర్రాడు.

ఈ కుర్రాడు ఎవరని ప్రతి ఒక్కరు ఆరా తీయడం మొదలుపెట్టారు. మరి ఆ కుర్రాడు వివరాలను ఇప్పుడు చూద్దాం. తను ఎవరో కాదు రామగిరి విష్ణు. తెలంగాణ కడెం ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ రామగిరి విష్ణు సినిమాలు మీద తనకి ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి వచ్చాడు. సొంతంగా ఒక కంప్యూటర్ ని కొనుక్కొని యూట్యూబ్ ద్వారా మెలకువలు నేర్చుకుని అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేస్తున్నాడు. విష్ణు ఏకంగా ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమాకి అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేశాడు విష్ణు హైదరాబాదులో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

Also read:

Salaar movie: Salaar siege fire is over.. and the title of part-2 is the same..!

తల్లిదండ్రులు శ్రీనివాసు, లత. తండ్రి దర్జీ పని చేస్తూ ఉంటాడు ఇంటర్ పూర్తి చేసిన విష్ణు డిగ్రీ చదువుతూనే సినీరంగం మీద ఉన్న ఆసక్తితో ఎడిటింగ్ కి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు యూట్యూబ్ ద్వారా ఎప్పటికప్పుడు తన డౌట్స్ ని క్లియర్ చేసుకునేవాడు. ప్రశాంత్ నీల్ ఈయనకి అవకాశం ఇవ్వడంతో ఈ సినిమాలో వర్క్ చేశాడు మొదటిసారి అగ్ర హీరో సినిమాకి అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేయడంతో అందరూ విష్ణు ని మెచ్చుకుంటున్నారు విష్ణు గతంలో కళ్యాణ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన మ్యాడ్ సినిమాకి కూడా పని చేశాడు. గ్యాంగ్ ఆఫ్ గోదావరి వంటి సినిమాల్లో కూడా అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసాడు.

You may also like

Leave a Comment