Telugu News » AP Politics : సీఎం జగన్‌పై దాడి.. విజయవాడ సీపీకి ఈసీ కీలక ఆదేశాలు!

AP Politics : సీఎం జగన్‌పై దాడి.. విజయవాడ సీపీకి ఈసీ కీలక ఆదేశాలు!

ఏపీలో సీఎం జగన్(Ap cm Jagan) దాడి జరిగిన ఘటనపై రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రిపై బండరాయితో దాడి జరిగితే ఆయన భద్రతా సిబ్బంది, దాడి జరుగుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే ఎందుకు అంచనా వేయలేకపోయానని మరోవైపు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

by Sai
Attack on CM Jagan.. EC key orders to Vijayawada CP!

ఏపీలో సీఎం జగన్(Ap cm Jagan) దాడి జరిగిన ఘటనపై రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రిపై బండరాయితో దాడి జరిగితే ఆయన భద్రతా సిబ్బంది, దాడి జరుగుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే ఎందుకు అంచనా వేయలేకపోయానని మరోవైపు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండగా సీఎంపై దాడి ఘటనను ఈసీ సీరియస్‌గా తీసుకున్నది. విజయవాడ సీపీ క్రాంతి రాణాకు ఎన్నికల సంఘం సీఈవో మీనా ఫోన్ ద్వారా టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం.

Attack on CM Jagan.. EC key orders to Vijayawada CP!

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పై దాడి ఘటనను ఈసీ సీరియస్‌(Election commission Serious) గా తీసుకోవడమే కాకుండా ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక, పోలీసు శాఖ తీసుకున్న చర్యల గురించి రిపోర్ట్ తయారు చేసి పంపించాలని సీఈవో మీనా విజయవాడ సీపీ క్రాంతిరాణాను ఆదేశించారు.ఈ ఎన్నికలను జీరో వయోలెన్స్ కింద నిర్వహించాలని ఈసీ భావించగా.. సీఎంపై దాడి జరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సీఈసీ మీనా తెలిపారు.

అయితే, సీఎం జగన్ విజయవాడలోని వివేకానంద స్కూల్ సర్కిల్ వద్ద శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనపై బండరాళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో జగన్ ఎడమ కంటిపై న తలకు బలమైన గాయం తగిలింది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

ఆ తర్వాత వైద్యులు తలకు అయిన గాయానికి కుట్లు వేసినట్లు సమాచారం. ఈ ఘటనలో సీఎం జగన్‌తో పాటు విజయవాడ వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా గాయం అయ్యింది.ఏపీ సీఎంపై దాడి ఘటనను పలువురు రాజకీయ నాయకులు ఖండించారు. అందులో ప్రధాని మోడీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, బీఆర్ఎస్ వర్కింగ్ప్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు.

 

You may also like

Leave a Comment