Telugu News » Sambhavana Seth: ‘ఆమ్ఆద్మీ’లో చేరి పెద్ద తప్పు చేశా: నటి సంభవన్ సేథ్

Sambhavana Seth: ‘ఆమ్ఆద్మీ’లో చేరి పెద్ద తప్పు చేశా: నటి సంభవన్ సేథ్

నటి సంభవనా సేథ్(Sambhavna Seth) సంచలన ప్రకటన చేసింది. ఆప్‌లో చేరడం తాను చేసిన పెద్ద తప్పుగా భావిస్తున్నట్లు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది.

by Mano
Sambhavana Seth: Big mistake by joining 'Aam Aadmi': Actress Sambhavana Seth

నటి సంభవనా సేథ్(Sambhavna Seth) సంచలన ప్రకటన చేసింది. సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌(x)లో పోస్ట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించింది. దేశానికి సేవ చేసేందుకే పార్టీలో చేరానని, ఇప్పుడు పార్టీలో చేరడం తాను చేసిన పెద్ద తప్పుగా భావిస్తున్నట్లు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది.

Sambhavana Seth: Big mistake by joining 'Aam Aadmi': Actress Sambhavana Seth

‘‘నేను ఏడాది కిందట చాలా ఉత్సాహంతో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాను. నేను ఆప్‌లో చేరినప్పుడు, నా దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా. మనుషులం కాబట్టి ఎంత తెలివిగా నిర్ణయాలు తీసుకున్నా ఎప్పుడో ఒకసారి తప్పు చేయవచ్చు. నా తప్పును గ్రహించి, ఆప్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తున్నా.’’ అంటూ పేర్కొంది.

రియాలిటీ షో స్టార్ సంభవనా సేథ్ 20 జనవరి 2023న ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. సినిమాలతో పాటు అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ భాగమైన సంభవ, ఢిల్లీ ఆప్ కార్యాలయంలో పార్టీ సభ్యురాలు అయ్యారు. పార్టీ సభ్యురాలిగా ఉన్న సమయంలో తాను డ్యాన్స్‌కు దూరంగా రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని సంభవనా సేథ్ చెప్పారు.

రాజకీయాల్లో భాగం కావడం తన స్వభావమని అయితే దాని గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని ఆయన అన్నారు. నేను దేశానికి ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను అని సంభవన్ అన్నారు. 12 ఏళ్ల కిందట తాను సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్‌తో మాట్లాడానని సంభవన్ చెప్పారు.

You may also like

Leave a Comment