Ramu
-హిందువులను విమర్శిస్తోంది
-కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు
-హస్తం పార్టీపై లక్ష్మణ్ ఫైర్
కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. హిందువుల మనోభావాలను ఆ పార్టీ దెబ్బ తీస్తోందని అన్నారు. రాముడు, రామసేతు మిథ్య అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. హిందువులను, హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదమని ఫైర్ అయ్యారు.
రాముడి మీద కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కిందని, త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ కులాన్ని పదే పదే ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ బీసీలను అవమానిస్తోందని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ నేతలకు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందని గుర్తు చేశారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్‌కు మనసు రాలేదని ఫైర్ అయ్యారు. ఐదుగురికి భారతరత్న ఇస్తే.. కాంగ్రెస్ ఓర్వలేక పోతోందన్నారు. అయోధ్య పర్యాటక, ఆధ్యాత్మిక రంగంగా వెలుగొందుతోందన్నారు.
మోడీ ప్రభుత్వం హిందుత్వం కోసం పని చేస్తోందని… ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక, బస్సు యాత్రలపై ఎన్నికల కమిటీ సమావేశాల్లో చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎండగట్టడమే లక్ష్యంగా యాత్రలు నిర్వహిస్తామన్నారు.
-బీజేపీకి 370, ఎన్డీఏకు 400కు పైగా సీట్లు
-ఊహకందని లక్ష్యాలను పూర్తి చేశారు
-దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు
-మూడవ సారి మోడీని పీఎం చేయండి
-మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతాం
-కేంద్ర హోం అమిత్ షా వెల్లడి
రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ (BJP)కి 370కు పైగా సీట్లు వస్తాయని, ఎన్డీఏ 400కు పైగా సీట్లను కైవసం చేసుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఎలాంటి సస్పెన్స్ లేదని వెల్లడించారు.
ప్రధాని మోడీ పదేండ్ల పాలనలో మొదటి ఐదేండ్లు కాంగ్రెస్ తవ్విన గొయ్యిని పూడ్చేందుకు సరిపోయిందని, మరో ఐదేండ్లు ఇప్పుడు అభివృద్ధికి పునాది వేసేందుకు కావాలన్నారు. గుజరాత్లో అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో రూ. 1,950 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను అమిత్ షా ప్రారంభించారు.
ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ….ప్రధాని మోడీని మూడవ సారి ప్రధానిగా చేయాలని కోరారు. అలా చేస్తే అభివృద్ది అనే భవనం అత్యంత తొందరగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. తాను ఆదివారం కర్ణాటకలో పర్యటించానన్నారు. జనవరిలో 11 రాష్ట్రాలు తిరిగినన్నారు. లోక్ సభ ఎన్నికల విషయంలో ఎవరి మనసులో ఎలాంటి సందేహం కనిపించ లేదన్నారు. బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏకు 400లకు పైగా సీట్లు వస్తాయని చెప్పారని అన్నారు.
గత 10 ఏళ్లలో ప్రధాని మోడీ అనేక అభివృద్ది పనులు చేపట్టారని, ఊహకందని లక్ష్యాలను పూర్తి చేశారన్నారు. ఈ పదేండ్లలో దేశాన్ని ప్రధాని మోడీ ఉన్నత శిఖరాలను తీసుకు వెళ్లారని చెప్పారు. మరో పదేండ్ల పాలన తర్వాత 2047లో భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రధాని కృషి ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి ప్రపంచంలోనే 5వ స్థానానికి ఎగబాకిందని వివరించారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
మంత్రి కోమటిరెడ్డి (Koamti Reddy Venkat Reddy) వ్యాఖ్యలపై హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆ వ్యాఖ్యలపై మంత్రి కోమటి రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పదేండ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిపై అలాంట వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో కృష్ణాజలాలపై చర్చ సందర్బంగా మాటల తూటాలు పేలాయి.
నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పజెప్పడంపై కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గిందని హరీశ్ రావు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన ప్రజెంటేషన్ ఇచ్చారని విమర్శించారు. దీంతో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మధ్యలో కల్పించుకున్నారు. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలు విన్న తర్వాత కేసీఆర్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నల్లగొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానమిచ్చారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీని చెప్పుతో కొడతామని తాము అనలేమా అని ప్రశ్నించారు. అమేథీలో రాహుల్‌ని కూడా ప్రజలు చెప్పుతో కొట్టినట్టేనా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డులను తొలగించాలని అన్నారు.
బేషరతుగా క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సభాపతి ఏకపక్షంగా మంత్రికి అవకాశం ఇవ్వడం సరికాదని అన్నారు. మంత్రి క్షమాపణలు చెబితేనే తాను మాట్లాడతానని హరీశ్ రావు పట్టుబట్టారు. దీంతో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తానని స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. దీంతో హరీశ్ రావు తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Komati Reddy Venkat Reddy : బీఆర్ఎస్ ను ప్రజలు చెప్పుతో కొట్టినట్టు…. మంత్రి తీవ్ర వ్యాఖ్యలు….!
బీఆర్ఎస్ పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. నల్లగొండ ప్రజలు బీఆర్ఎస్ (BRS)ను చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మాజీ సీఎం కేసీఆర్ దొంగ దీక్షలు చేశారంటూ నిప్పులు చెరిగారు.
వీటిని చదవండి: CM Revanth Reddy: మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం.. అక్కడే సభకు ఏర్పాట్లు..!
అసెంబ్లీలో సాగు నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం, ప్రతి పక్షానికి మధ్య మాటల యుద్దం నడిచింది. ఈ చర్చ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కారకులం తామేనని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియా గాంధీని కోరామని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
వీటిని చదవండి: దొంగలకు సద్దులు మోయడం మానుకోవాలి.. అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ హరీష్ రావు..!..!
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. అసలు కేసీఆర్‌కు తెలంగాణకు సంబంధమే లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండు నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్వల్ప ఓట్ల డిపాజిట్ దక్కించుకోగలిందని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీ నాయకుడు ఏ మొహంతో నల్లగొండలో సభ పెడతారని నిలదీశారు.
నల్లగొండ జిల్లా ముందు తమ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీనే అని కేసీఆర్ కూడా గతంలో పలు మార్లు అన్నారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో హరీశ్ రావుకు పెట్రోల్ దొరికిందని గానీ, అగ్గిపెట్టే దొరకలేదంటూ మంత్రి సెటైర్లు వేశారు.
Sagarika Ghosh : ఆ మాటలు మరచి పోయారా…. సాగరిక ఘోష్‌ను ఏకి పారేస్తున్న నెటిజన్లు….!
సీనియర్ జర్నలిస్టు, రచయిత సాగరిక ఘోష్ (Sagarika Ghosh)ను రాజ్యసభ అభ్యర్థిగా టీఎంసీ (TMC) నామినెట్ చేసింది. ఈ నెల 27న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆమె టీఎంసీ తరఫున పోటీ చేయనున్నారు. తనను రాజ్య సభ అభ్యర్థిగా టీఎంసీ ఎంపిక చేయడంపై సాగరిక ఘోష్ స్పందించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ధైర్యాన్ని చూసి తాను స్పూర్తి పొందానని వెల్లడించారు.
‘టీఎంసీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయినందుకు నేను సంతోషిస్తున్నాను. దీన్ని గౌరవంగా భావిస్తున్నాను. దేశంలో ప్రస్తుత ఏకైక మహిళా ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ధైర్యసాహసాల నుంచి నేను స్ఫూర్తి పొందుతున్నాను. రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువల పట్ల నా నిబద్ధత ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది’అని సాగరిక ఘోష్ ట్వీట్ చేశారు.
ఇది ఇలా వుంటే గతంలో సాగరిక ఘోష్ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. గతంలో ఆమె జర్నలిస్టులు, ఐఎంహెచ్ఓ రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. జర్నలిస్టులు ఏ పార్టీకి విధేయత చూపరాదు అని అన్నారు. స్వాతంత్ర్యంతో రాజీపడటం అనేది జర్నలిస్తులు తమకు తాముగా చేసుకోగలిగే చెత్త పని అని మండిపడ్డారు. పౌర సమాజాన్ని, ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం, న్యాయం కోసం పని చేద్దామని పిలుపు నిచ్చారు.
అంతకు ముందు మరో ట్వీట్లో తాను ఏ రాజకీయ పార్టీ నుంచి ఎలాంటి రాజ్యసభ (ఆర్ఎస్) టికెట్ కానీ, పీఎస్ టికెట్ కానీ, సీఎస్ టికెట్ కానీ అంగీకరించబోనని అన్నారు. ఈ విషయాన్ని బాండ్ కాగితంపై రాసిస్తానన్నారు. కావాలంటే ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ చేసి సేవ్ చేసుకొండి అని తెలిపారు. ఇప్పుడ ఆ ట్వీట్ లను షేర్ చేస్తూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఆ మాటలు మరచి పోయారా… అని ప్రశ్నిస్తున్నారు. చెప్పేదొకటి చేసే దొకటి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అబాదీ భానో బేగం (Abadi Bano Begum) … భారత స్వతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ముస్లిం మహిళ. ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించిన అలీ సోదరుల (Ali Borthers)ల మాతృమూర్తి. బురఖా ధరించి రాజకీయ సమావేశంలో ప్రసంగించిన తొలి మహిళ ఆమె. స్వతంత్ర్య ఉద్యమంలో మహిళల మద్దతు కోసం మహాత్మ గాంధీ ఆమె సహాయాన్ని కోరారంటే ఆమె నాయకత్వం గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు.
1850లో యూపీలో అబాదీ భానో బేగం జన్మించారు. రాంపూర్ సంస్థానంలోని సీనియర్ అధికారిగా ఉన్న అబ్దుల్ అలీఖాన్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఆరుగురు సంతానం. ఆమె కుమారుల్లో మౌలానా షౌకత్ అలీ, మౌలానా మహమ్మద్ అలీ జవహర్‌లు చరిత్రలో అలీ సోదరులుగా ప్రసిద్ది చెందారు. అలీ సోదరులిద్దరూ కలిసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
చిన్నతనంలోనే భర్తను కోల్పోయినప్పటికీ కష్టపడి పని చేసి తన పిల్లలకు మంచి విద్యను అందించారు. 1917లో బ్రిటీష్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న అలీ బ్రదర్స్ ను విడుదల చేయాలని కోరుతూ ఆమె నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే అబాదీ భానో బేగంతో గాంధీ సమావేశమై స్వాతంత్య్ర ఉద్యమానికి మహిళల మద్దతును కోరేందుకు ఆమె సహాయాన్ని కోరారు. ఆ సమయంలో ఆమెను తన తల్లి అని సంబోధించాడు.
కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ సమావేశాల సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ… అన్ని మతాలకు చెందిన భారతీయులు ఐక్యంగా ఉంటేనే సంపూర్ణ స్వాతంత్ర్యం లభిస్తుందన్నారు.. అనేక సమావేశాలలో, ఆమె తన దేశంలోని కుక్కలు మరియు పిల్లులు కూడా బ్రిటిష్ వారి బానిసత్వంలో ఉండకూడదనేది తన ఆశయమని బహిరంగంగా ప్రకటించేవారు.
1924లో ఆమె మరణించారు. ఆమె మరణించిన అరవై ఆరు సంవత్సరాల తరువాత పాకిస్తాన్ ఆమె గౌరవార్థం స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 28 సెప్టెంబర్ 2012న న్యూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా ఇన్స్టిట్యూట్లో అబాదీ బానో బేగం జ్ఞాపకార్థం ఒక బాలిక హాస్టల్‌కు ఆమె పేరు పెట్టారు.