బాలీవుడ్(Bollywood) హీరో అక్షయ్ కుమార్ కు కేంద్రప్రభుత్వం తీపికబురు చెప్పింది.ఎట్టకేలకు అక్షయ్ కు భారతీయ పౌరసత్వాన్నిఇచ్చింది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ స్వయంగా తెలియజేశారు. కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో సంబంధిత సమాచారాన్ని అభిమానులతో పంచుకున్నారు.
నిజానికి- అక్షయ్ కుమార్ ఇండియన్ కాదు కెనడియన్. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు కూడా..!ఆయనకు కెనడా(Canada) పౌరసత్వం ఉంది. కెనడా ప్రభుత్వం అందించిన పాస్‌పోర్ట్ తోనే భారత్‌లో నివసిస్తోన్నారు. కొద్దిరోజుల కిందటే తన కెనడా పాస్‌పోర్ట్(Passport)ను కూడా రెన్యువల్ చేయించుకున్నారు.
దీనితో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం భారతీయ పౌరసత్వాన్ని(Indian citizenship) కల్పించింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. తాజా చిత్రం ఓఎంజీ 2. ఈ సినిమా సక్సెస్‌ను అక్షయ్ ఎంజాయ్ చేస్తోన్నాడు. పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ నటించిన ఈ మూవీ 100 కోట్ల రూపాయల క్లబ్‌కు చేరువైంది.
దీని తరువాత ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ సినిమాలో నటించనున్నారు. ఇది కోల్ మైన్ ఇంజినీర్ జస్వంత్ సింగ్ గిల్ బయోపిక్.బొగ్గు గనుల్లో చిక్కుకుపోయిన 64 మంది కార్మికులను రక్షించిన జస్వంత్ సింగ్ గిల్ క్యారెక్టర్‌ను అక్షయ్ కుమార్ పోషిస్తోన్నారు.
దీని తరువాత కేసీ శంకరన్, సుధా కొంగర, అలీ అబ్బాస్ జాఫర్ సినిమాలు వరుసగా తెరకెక్కనున్నాయి. సాజిద్ నడియాడ్వాలా ఫ్రాంఛైజీ సీక్వెల్స్ హౌస్‌ఫుల్ 4, వెల్కమ్ 3, హేరా ఫేరీ 3 మూవీలకు సైన్ చేశారు.
Dil aur citizenship, dono Hindustani.
Happy Independence Day!
Jai Hind! 🇮🇳 pic.twitter.com/DLH0DtbGxk— Akshay Kumar (@akshaykumar) August 15, 2023









చిరుతపులి నమూనా ద్వారా అది మనిషిని తిన్నదా..? లేదా..? అని త్వరలోనే నిర్ధారించి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ మేరకు చిరుత నమూనాలను ఐసర్‌కు పంపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.






