Telugu News » Hardik Haters : ‘‘హార్దిక’ ఓటమి శుభాకాంక్షల’పై నెటిజెన్స్ సీరియస్..!

Hardik Haters : ‘‘హార్దిక’ ఓటమి శుభాకాంక్షల’పై నెటిజెన్స్ సీరియస్..!

టీమిండియా(Team India) వెస్టిండీస్ పర్యటన ముగిసింది. టెస్ట్, వన్డే సిరీస్ లను కైవసం చేసుకున్నప్పటికీ, టీట్వంటీ మాత్రం కరేబియన్స్(Caribbeans)కి కట్టబెట్టింది.

by sai krishna

టీమిండియా(Team India) వెస్టిండీస్ పర్యటన ముగిసింది. టెస్ట్, వన్డే సిరీస్ లను కైవసం చేసుకున్నప్పటికీ, టీట్వంటీ మాత్రం కరేబియన్స్(Caribbeans)కి కట్టబెట్టింది.

తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయే దశలో ఉన్న భారత జట్టును తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లు పరువునిలబెట్టారు.అయితే ఆదివారం జరిగిన 5వ టీ20 మ్యాచ్‌(T20 match)లో మాత్రం టీమిండియా చతికిలపడింది. సూర్య కుమార్ యాదవ్ కాస్త బెటర్ అనిపించాడు.మిగిలిన వాళ్లు విఫలయత్నం చేశారు.


6 సంవత్సరాల తర్వాత భారతజట్టు తొలి సారిగా టీ20 సిరీస్‌ను చేజార్చుకుంది.అలాగే దాదాపు 17 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్(West Indies)జట్టు భారత్‌పై సిరీస్‌ను గెలుచుకుంది. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు.

అయితే వారి ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లుగా ఉన్నాయి మ్యాచ్‌ ముగిసిన తర్వాత కెప్టెన్ హార్దిక్ మాటలు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టుపై వెస్టిండీస్ టీమ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది.

మ్యాచ్ తర్వాత హార్దిక్ మాట్లాడుతూ ‘ఒక టీమ్‌గా మమ్మల్ని మేము ఛాలెంజ్ చేసుకోవాలనే ఆలోచనతోనే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నా.ఇవన్నీ కూడా కొత్త విషయాలు నేర్చుకునే మ్యాచులే.

అడపాదడపా ఒక సిరీస్ కోల్పోవడం సమస్యే కాదు. కానీ టార్గెట్ కోసం కమిట్ మెంట్ చాలా ముఖ్యం. ఒక్కోసారి ఓడిపోవడం కూడా మంచిదే’నని అన్నాడు. ఇలా సిరీస్ కోల్పోవడం సమస్యే కాదని హార్దిక్ అనడం అభిమానులకు నచ్చలేదు.

ఇదే పాటు మ్యాచ్ సమయంలో పాండ్యా చేసిన బౌలింగ్ మార్పులు కూడా ఓటమికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అటు టీమిండియా అభిమానులు, ఇటు నెటిజన్లు హార్దిక్‌ని ట్రోల్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment