Telugu News » Hindu Heroes :నేను హిందువుని.. అని గర్వపడే నటులు..!

Hindu Heroes :నేను హిందువుని.. అని గర్వపడే నటులు..!

ప్రపంచ వ్యాప్తంగా భారతీయతకు, హిందుత్వ సిద్ధాంతాలకు ప్రాచుర్యం పెరిగింది. విదేశీయులు సైతం ఆకర్షితులవుతున్నారు.

by sai krishna

ప్రపంచ వ్యాప్తంగా భారతీయతకు, హిందుత్వ సిద్ధాంతాలకు ప్రాచుర్యం పెరిగింది. విదేశీయులు సైతం ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే శీల ప్రభుపాద స్వామీజీ పరిచయం చేసిన ఇస్కాన్(ISKCON) భక్తులు విదేశాల్లో ఉండనే ఉన్నారు.

ప్రవాసభారతీయుల ద్వారా హిందూ ధర్మం, భారతీయత పరిచయం అయ్యింది. ప్రవాస భారతీయుల ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆయా పండుగలకు, పర్వదినాలకు మన వాళ్ల నుంచి ఆహ్వానాలు అందుకుంటున్నారు.

ఇటీవల విడుదలైన బాహుబలి(Bahubali) , ట్రిపుల్ ఆర్(RRR) సినిమాలు కూడా ప్రపంచదేశాల్లో విశేషంగా ఆకట్టుకున్నాయి. భారతీయ నటులకు సైతం ఆదరణం పెరిగింది. ఈ నేపథ్యంలో  హిందుధర్మాన్ని పాటించే కొందరు కల్ట్ హిందూ హీరోలు సోషల్ మీడియా వేదికగా చక్కెర్లు కొడుతున్నారు. వారి గురించి తెలుసుకుందాం.

రామ్ చరణ్ : నేను హిందువునని ప్రౌడ్ గా ఫీలయ్యే వాళ్లలో రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గ్లోబల్ స్టార్ (Global star )ఇమేజ్ సంపాదించుకున్నాడు. షూటింగ్ లోనూ,తన రేసింగుల్లోనూ బిజీగా ఉన్నా.. దైవభక్తిని మాత్రం విడిచిపెట్టడు.క్రమం తప్పకుండా ఏదో ఒక మాల ధరిస్తూ ఉంటారు.

 

రజనీ కాంత్ : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆయన నటించిన సినిమాలకు వెళ్తాం. ఆయన సినిమా.. సినిమాకి హిమాలయాలకు వెళ్లివస్తూ ఉంటారు. ఇంతకుమించి రజనీకాంత్(Rajinikanth) ఆధ్యాత్మిక చింతన గురించి చెప్పేదేముంది.

జూనియర్ ఎన్టీఆర్: తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అద్భుత నటుడు. ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఎన్టీఆర్ కూడా చెప్పుకోతగ్గ దైవభక్తుడు. తరచూ పుణ్యక్షేత్ర సందర్శన చేస్తుంటాడు, మరియు అప్పుడప్పుడూ మాలధారణ కూడా చేస్తుంటారు.

అల్లు అర్జున్ : పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ ఖాయం చేసుకున్నాడు. పుష్ప- 2 ఇండియాస్ నెంబర్ వన్ హీరో ప్లేస్ ను కొట్టేసే పనిలో ఉన్నాడు. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా భారతీయ సాంప్రదాయ మూలాలను మరిచిపోడు. తల్లిదండ్రు చూపిన హిందుత్వ మార్గాన్ని అనుసరిస్తూ అటు ఐకానిక్ స్టైలిష్ స్టార్ గాను ఇటు ఆధ్యాత్మికచింతనలోనూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.

మోహన్ లాల్ : ప్రఖ్యాత మలయాళ నటుడు. బాలకృష్ణ హీరోగానటించిన గాంఢీవం చిత్రం ద్వారా తెలగు ప్రేక్షకులకు సుపరిచితుడు. జనతా గ్యారేజ్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయ్యంగార్ కుటుంబానికి చెందిన మోహన్ లాల్ కి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. షూటింగ్ లో బిజీగా ఉన్నా దైవ దర్శనానికి వెళ్తుంటాడు. మలయాళ ఇండస్ట్రీలో పేరు మోసిన హిందూనటుడు.

మహేశ్ బాబు : సూపర్ స్టార్ తనయుడిగా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రాజమౌళి దర్వకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. మహేష్ కూడా గొప్ప దైవభక్తుడు. టైమ్ దొరికినప్పుడల్లా విదేశాలను ఎలా చుట్టివస్తాడో వివిధ ఆలయాలను కూడా అలానే దర్శించుకుని వచ్చే ఫ్యామిలీ మేన్.

కిచ్చా సుదీప్ : కన్నడ ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. హిందు ధర్మమార్గంలో పయనిస్తున్న నటుడు. దైవచింతనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాడు.

అజిత్ : సినిమాలో సైతం వయసుకి ముసుగు వేయని హీరో..సినిమాలు ఓవైపు, తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ మరో వైపు. ఇంకో వైపు ఆధ్యాత్మిక చింతన. ఓ అన్వేషిగా లాంగ్ డ్రైవ్స్ చేస్తుంటారు. ఆయా ప్రాంతాల దేవాలయాలను సందర్శిస్తుంటారు.

యశ్ : కేజీఎఫ్ (KGF) తో ప్యాన్ ఇండియన్ నటుడిగా పేరు సంపాదించాడు. ఈ హీరో కూడా దైవ చింతనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటాడు. పుణ్య క్షేత్ర సందర్శనాలు కూడా ఎక్కువే.

 

బ్రహ్మానందం: భారత దేశం గర్వించతగ్గ హాస్యనటుడు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కవ సినిమాలు నటించిన ప్రతిభాశాలి. కంటి చూపుతో కామెడీ పుట్టించగల దిట్ట. సినిమాల్లోకి రాకముందు బ్రహ్మి తెలుగు లెక్చరర్. రామాయణ(Ramayana), భారత, భాగవతాల మీద అవగాహన ఉన్న నటుడు. అనర్గళంగా సంస్కృత శ్లోకాలను ప్రస్తావించి వాటి తాత్పర్యాన్ని వివరించగలరు.దైవ చింతన ఎక్కువ. ఖాళీ సమయాలు దొరికితే వివిధ దేవీదేవతల పెన్సిల్ ఆర్ట్స్ వేసి ప్రముఖులకు బహూకరిస్తూ ఉంటారు.

You may also like

Leave a Comment