Telugu News » Crime Catch Specialist : ‘రక్ష’ ది పోలీస్ డాగ్..24 గంటల్లో హంతకుడిని పట్టేసింది..!

Crime Catch Specialist : ‘రక్ష’ ది పోలీస్ డాగ్..24 గంటల్లో హంతకుడిని పట్టేసింది..!

కర్ణాటకలోని కోలార్ జిల్లా(Kolar District) బేవహల్లిలో ఓ హత్య జరిగింది.ఎటువంటి ఆధారాలు దొరకలేదు.అప్పుడు రంగంలోకి దిగింది ‘రక్ష’ .

by sai krishna

కర్ణాటకలోని కోలార్ జిల్లా(Kolar District) బేవహల్లిలో ఓ హత్య జరిగింది.ఎటువంటి ఆధారాలు దొరకలేదు.అప్పుడు రంగంలోకి దిగింది ‘రక్ష’ .వాసన పసిగట్టి ఎలాంటి నేరస్తుడినైనా పసిగట్టడంలో దిట్టైన పోలీస్ జాగిలం.1.5 కిలోమీటర్లు పరిగెత్తుకెళ్లి పొదల మధ్య దాక్కున్న నిందితుణ్ణి పట్టి పోలీసులకు అప్పజెప్పింది.

దీంతో పోలీసుల పని తేలికైంది.అసలు ఈ హత్య ఎందుకు జరిగింది?, ఎలాజరిగింది?.పోలీస్ జాగిలం రక్ష ఎంత సమయంలో పట్టుకోగలిగింది.? లాంటి వివరాల్లోకి వెళితే…కోలార్ జిల్లా బేవహల్లికి చెందిన సురేశ్, రవి మంచి స్నేహితులు.

ఆగస్టు 11వ తేదీ రాత్రి వీరిద్దరు కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో సురేశ్, రవి మధ్య గొడవ జరిగింది.అనంతరం వారిద్దరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే సురేశ్పై కోపం పెంచుకున్నాడు రవి.

స్నేహితుడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సురేశ్ ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న అతడిపై ఇనుప రాడ్తో దాడి చేసి చంపాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.

సమాచారం అందుకున్న నంగలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ వారికి హత్యకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. డాగ్ స్క్వాడ్‌(Dog Squad), ఫోరెన్సిక్ బృందం (Forensic team)సమాయత్తం అయ్యింది.

హత్య జరిగిన ప్రదేశంలో రక్తం వాసన రావడం వల్ల ‘రక్ష’ అనే పోలీస్ డాగ్ 1.5 కిలోమీటర్లు పరుగెత్తుకెళ్లి పొదల్లో దాక్కున్న నిందితుడు రవిని గుర్తించింది. నంగలి పోలీసులు..నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.ఈ క్రమంలో నిందితుడు.. పోలీసులు ఎదుట తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు.

నిందితుడిని 24 గంటల్లో పట్టించిన శునకం ‘రక్ష’.. గత 8 ఏళ్లుగా కోలార్ క్రైమ్ బ్రాంచ్(Kolar Crime Branch)పోలీసులకి ఇలాంటి విషయాలని సాల్వ్ చేసే స్పెషలిస్ట్ శునకం. ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను పోలీసులకు పట్టించింది. ‘రక్ష’పై పోలీసులు సహా స్థానికులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

You may also like

Leave a Comment