దేవుడున్నాడో లేడో ఎవరికీ లేదు. కానీ తల్లిని మించిన దైవం లేదన్నది వాస్తవం. మన ప్రాణాలనే తనకు పంచప్రాణాలుగా రక్తాన్ని పంచి, ప్రేమతో పెంచే దేవత తల్లి. ఎల్లప్పుడూ బిడ్డ క్షేమాన్ని, విజయాన్ని కోరే రుణం ఎవ్వరూ ఎప్పటికీ తీర్చుకోలేనిది.
అంత గొప్ప మనసున్న పూజించాల్సింది పోయి..ఆమె కన్న బిడ్డలే తమ తల్లివల్ల కలిసిరావటం లేదని సూటిపోటి మాటలతో, చేష్టలతో ఇంట్లోంచి వెళ్లగొట్టారు. భర్తను కోల్పోయిన ఆమెపై కన్న బిడ్డలు కూడా కనికరం చూపక పోవడంతో చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించింది. హృదయ విదారకమైన ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
పాత గుంటూరు(Old Guntur)కు చెందిన రాములమ్మ (Ramulamma), సుబ్బారావు దంపతులు. కూలీ పని చేసుకొని జీవనం సాగించేవారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. యుక్త వయస్సు రాగానే వీరిద్దకి పెళ్లి చేసి పంపించారు.
ఆ తర్వాత కొంతకాలానికే సుబ్బారావు చనిపోయాడు.అతను కాలంచేసి ఇప్పటికి 10 సంవత్సరాలవుతోంది.అప్పటి నుండి రాములమ్మ తన కన్నబిడ్డల వద్ద ఉంటూ వస్తుంది.
అయితే కరోనా ఆమె పట్ల కనికరం చూపించలేక పోయింది. కరోనా సమయంలో తన కుటుంబాన్ని గడుపుకోవడమే కష్టంగా మారిందంటూ కొడుకు రాములమ్మను బయటకు పంపించాడు. దీంతో ఆమె పొట్ట చేత బట్టుకొని కూతురు ఇంటింకి చేరుకుంది.
కొద్ది కాలం బాగానే చూసుకున్న కూతురు ఆ తర్వాత తల్లి రాములమ్మను సూటి పోటి మాటలతో వేధించడం మొదలు పెట్టింది. ‘నువ్వు మాతో ఉంటే కలిసి రావడం లేదు’ అంటూ దూషించడం మొదలు పెట్టింది.
ఇప్పుడు ఏకంగా ఇంటిలో నుండి వెళ్లి పోవాలంటూ తరిమేసింది. దీంతో దిక్కులేని పరిస్థితిలో గోనే సంచిలో తన బట్టలు సర్ధుకొని ఇంటి నుంచి బయట పడింది రాములమ్మ.ఎక్కడకు వెళ్లాలో తెలియని స్థితిలో ఏకంగా పోలీస్ స్టేషన్కు చేరుకుంది.
కొత్త పేట పోలీసులకు దండం పెట్టి కూతురు, కొడుకు తనను చూడటం లేదన్న సంగతి చెప్పింది. అయితే కొడుకు, కూతురు ఇద్దరినీ పిలిచి కౌన్సిలింగ్ (Counseling)ఇస్తామని వారితో ఇంటికి వెళ్లాలని కొత్త పేట పోలీసులు చెప్పారు.
అయితే వారితో వెళ్లేందుకు రాములమ్మ నిరాకరించింది. తనను వృద్ధాశ్రమానికి పంపించాలంటూ పోలీసులను వేడుకుంది. దీంతో పోలీసులు కోవిడ్ ఫైటర్స్(Covid fighters)కు ఫోన్ చేసి రాములమ్మ పరిస్థితిని చెప్పారు.
విషయం తెలిసిన కోవిడ్ ఫైటర్స్ రాములమ్మ పొన్నూరు రోడ్డులో ఉన్న గోతాల స్వామి(Gotala Swamy)వృద్దాశ్రమంలో చేర్పించారు. ప్రస్తుతం రాములమ్మ అక్కడే తలదాచుకుంటోంది.