టాలీవుడ్ (Tollywood) సినీ నటుడు, సీనియర్ హీరో తోట్టెంపూడి వేణు (Thottempudi Venu) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకొంది. వేణు తండ్రి తోట్టెంపూడి వెంకట సుబ్బారావు (Venkata Subbarao) ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 92 ఏళ్ళ వయస్సు ఉన్న ఆయన వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసినట్టు (Died) తెలుస్తోంది. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
తోట్టెంపూడి వెంకట సుబ్బారావు ఫ్రోఫెసర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. పొలిటికల్, బిజినెస్ ఫ్యామిలీ గా తొట్టెంపూడి కుటుంబానికి పేరుంది. ఇక వేణు సినీ నటుడిగా, కామెడీ హీరోగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకొన్నారు ఇక హీరోగా అవకాశాలు తగ్గడంలో.. చాలా కాలంగ తన బిజినెస్ లు చూసుకొంటూ ఉన్నట్లుగా తెలుస్తోంది.. ఇక రీసెంట్ గా రవితేజ్ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు వేణు.
మరోవైపు తోట్టెంపూడి వెంకట సుబ్బారావు భౌతికాయాన్ని సందర్శనార్ధం ఈ రోజు ఉదయం 9.00 గంటలు నుంచి మధ్యాహ్నం 12.00 ల మధ్య హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్, నందు ఉన్న వారి నివాసంలో సందర్శనార్థం ఉంచనున్నారని సమాచారం. అనంతరం మధ్యాహ్నం తర్వాత జూబ్లీహిల్స్, మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇక వేణుకు పితృ వియోగం వార్త తెలుసుకొన్న ప్రముఖులు ఆయనకు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు..



నర్సారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆయన మృతిపట్ల సంతాపం తెలియచేసారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిర్మల్ (Nirmal) జిల్లా, మలక్ చించోలి గ్రామానికి చెందిన నర్సారెడ్డి కాంగ్రెస్లో అంచెలచెంలుగా ఎదిగి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా పని చేశారు. జలగం వెంగళరావు కేబినెట్లో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు.. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో సేవలు అందించారు.




మరోవైపు పలువురు వైసీపీ (YCP) నుంచి టీడీపీలో చేరారు. వారికి నారా లోకేశ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా.. మంగళగిరి (Mangalagiri)లో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురుతుందని వెల్లడించారు. మంగళగిరి నియోజకవర్గానికి నిధులు కేటాయించినప్పటికీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని జగన్ ప్రభుత్వంపై లోకేశ్ ఫైర్ అయ్యారు.
