Telugu News » KTR : తప్పు నాదే సరిదిద్దుకొంటా.. రెట్టింపు వేగంతో దూసుకొస్తా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

KTR : తప్పు నాదే సరిదిద్దుకొంటా.. రెట్టింపు వేగంతో దూసుకొస్తా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేక తప్పించుకొనేందుకు రోజుకో సాకు చెబుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌పై రోజుకో అవినీతి కథ అల్లుతున్నారని పేర్కొన్నారు..

by Venu

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) తీరు రోజు రోజుకు వివాదాస్పదం అవుతుందని అంటున్నారు.. రొట్టె ముక్క కోసం కొట్టుకొన్నట్లు.. అధికారం కోసం తగవులాడుకోవడం ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. ప్రత్యేక రాష్ట్రం కేవలం కేసీఆర్ (KCR) వల్లే వచ్చిందని భావిస్తున్న వారికి.. ప్రాణత్యాగాలు అర్పించిన వారు గుర్తుకు రాకపోవడం.. అమరవీరుల ఊసు ఎత్తకపోవడం విజ్ఞత లేదని అనిపిస్తున్నట్లుగా కొందరు పేర్కొంటున్నారు..

ఇదిలా ఉండగా వరుస విమర్శలతో ఊపు మీదున్న కేటీఆర్ (KTR) నేడు సిరిసిల్ల (Sircilla) నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకొన్న ముఖ్యమంత్రి కాదని.. ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటా ముఖ్యమంత్రి అని కామెంట్స్ చేసిన ఆయన.. కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగు పాములై బుసలు కొడుతాయని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేక తప్పించుకొనేందుకు రోజుకో సాకు చెబుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌పై రోజుకో అవినీతి కథ అల్లుతున్నారని పేర్కొన్నారు.. బీఆర్ఎస్ చేసిన అవినీతి ఏంటో వెలికి తీయాలని డిమాండ్ చేసిన కేటీఆర్.. అవినీతి చేసినట్లు నిరూపిస్తే బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదన్నారు.

బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ అధైర్య పడొద్దని.. ఇది చిన్న బ్రేక్ మాత్రమే అని తెలిపిన కేటీఆర్.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని తెలిపారు. దాదాపు 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని.. తప్పు నాదే కావచ్చు.. సరిదిద్దుకొని రెట్టింపు వేగంతో దూసుకొస్తానని వెల్లడించారు.. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు దేశంలోనే లేదని.. ఆయన రాక మనందరికీ ధైర్యం అని అభిప్రాయపడ్డారు.

You may also like

Leave a Comment