Telugu News » Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు..? క్లారిటీ..!

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు..? క్లారిటీ..!

అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కళ్లారా చూడాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు.

by Mano
Ayodhya Ram Mandir: VIP tickets for Ayodhya Ram Mandir opening ceremony..? Clarity..!

కోట్లాది మంది భారతీయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహత్తర ఘట్టానికి ఇంకా కొద్దిరోజులే మిగిలుంది. జనవరి 22వ తేదీన జరగనున్న అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కళ్లారా చూడాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.

Ayodhya Ram Mandir: VIP tickets for Ayodhya Ram Mandir opening ceremony..? Clarity..!

ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా? అంటూ జనాలకు ఆశచూపుతున్నారు. మాయమాటలు చెప్పి బ్యాంక్‌ అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. ‘‘జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా? అయితే ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి..’’ అంటూ సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ ద్వారా ఫేక్ మెసేజ్‌లను పంపిస్తున్నారు.

మరికొందరైతే ఏపీకే ఫైల్‌ పంపించి ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే డైరెక్ట్‌గా వీఐపీ యాక్సెస్‌ దొరుకుతుంది అంటూ వాట్సాప్‌ల్లో మెసేజ్‌లు ఫార్వర్డ్‌ చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌ల్లోని లింక్‌లను క్లిక్‌ చేసినా.. ఏపీకే ఫైల్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారి అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఈ మోసాలపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రజలను అప్రమత్తం చేశారు.

‘దీనివల్ల మీ పర్సనల్‌, బ్యాంక్‌ డేటా మొత్తం స్కామర్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అయోధ్య రామ మందిరం పేరుతో జరుగుతున్న ఇలాంటి మెసేజ్‌లను, లింక్‌లను ఓపెన్‌ చేయొద్దని సూచించారు. అదేవిధంగా ఏపీకే ఫైల్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దన్నారు. అలా చేస్తే మీ డేటాను సైబర్‌ నేరగాళ్లు దోచుకుని మోసాలకు పాల్పడతారని హెచ్చరించారు.

You may also like

Leave a Comment