Telugu News » Ayodhya : అయోధ్యలో 2400 కిలోల భారీ గంట….దేశంలోనే…. !

Ayodhya : అయోధ్యలో 2400 కిలోల భారీ గంట….దేశంలోనే…. !

రూ. 24 లక్షల వ్యయంతో అష్టదాతువులతో ఈ గంటను తయారు చేశారు. ఈ భారీ గంట మంగళవారం రామ మందిరానికి చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

by Ramu
Ayodhya Ram temple to get 2400kg bell from UPs Etah largest in country says maker

అయోధ్య (Ayodhya) రామ మందిరంలో 2400కిలోల భారీ గంట(Bell)ను ఏర్పాటు చేయనున్నారు . యూపీలోని ఇటావా జిల్లా జలేసర్ పట్టణంలో దీన్ని తయారు చేశారు. రూ. 24 లక్షల వ్యయంతో అష్టదాతువులతో ఈ గంటను తయారు చేశారు. ఈ భారీ గంట మంగళవారం రామ మందిరానికి చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దేశంలో ఇది అతి పెద్ద గంట అని చెప్పారు.

Ayodhya Ram temple to get 2400kg bell from UPs Etah largest in country says maker

ఈ గంట తయారీలో 30 మంది వర్కర్ల టీమ్ పాల్గొంది. గంట తయారీకి బంగారం, వెండి, రాగి, జింక్, సీసం, తగరం, ఇనుము, పాదరసం మిశ్రమాలను ఉపయోగించారు. ఈ గంటను వ్యాపారవేత్త ఆదిత్య మిట్టల్ ఆలయానికి అందించారు. తన సోదరుడు వికాస్ మిట్టల్ 2002లో గుండె పోటుతో మరణించారని వెల్లడించారు.

ఈ గంటను ఆలయానికి తన సోదరుడు వికాస్ మిట్టల్ డొనేట్ చేయాలని అనుకున్నట్టు తెలిపారు. ఆ గంట ఆరు అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పు ఉంటుందని తెలిపారు. ఈ గంటను మోగిస్తే ఆలయం చుట్టూ 2 కిలో మీటర్ల పరిధి వరకు ఆ శబ్ధం వినిపిస్తుందని ఆదిత్య మిట్టల్ వివరించారు.

ఆలయ గంటల తయారీకి యూపీలోని ఇటావా ప్రాంతం చాలా ప్రసిద్ధి. ఆలయంలో గంటల ఏర్పాటు కోసం దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆర్డర్ ఇస్తుంటారు. ఒక్క జలేసర్‌లోని సుమారు 300 కర్మాగారాలు ఈ క్రాఫ్ట్ కళకు అనుసంధానంగా పని చేస్తున్నాయి. 2002 అక్టోబర్ యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ఇటావాలో పర్యటించారు. అప్పుడు ఈ గంటను చూసి ‘సనాతన హిందు ధర్మం వాయిస్‌ను ఇది ప్రపంచమంతటా వినిపించేలా చేస్తుంది’ అని అన్నారు.

You may also like

Leave a Comment