Telugu News » Jyothula Nehru: ‘కలిసి పనిచేద్దామా?..’ ముద్రగడతో నెహ్రూ భేటీ..!

Jyothula Nehru: ‘కలిసి పనిచేద్దామా?..’ ముద్రగడతో నెహ్రూ భేటీ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP)కి దగ్గరగా ఉన్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) క్రమంగా దూరమవుతున్నారనే చర్చ సాగుతోంది.

by Mano
Jyothula Nehru: 'Let's work together?..' Nehru met with Mudragada..!

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీ(AP)లో పొలిటికల్ హీట్(Political Heat) పెరుగుతోంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP)కి దగ్గరగా ఉన్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) క్రమంగా దూరమవుతున్నారనే చర్చ సాగుతోంది.

Jyothula Nehru: 'Let's work together?..' Nehru met with Mudragada..!

ఇప్పటికే జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఇవాళ(గురువారం), టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడ నివాసానికి వెళ్లడం చర్చనీయాంశమైంది. కాపు సామాజికవర్గం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముద్రగడ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాపు నేతగానే తాను ముద్రగడ దగ్గరకు వచ్చానని క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటివరకు కాపు సామాజిక వర్గంలో ఐక్యత లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, టీడీపీ-జనసేన కూటమిలో కాపులకి అధిక ప్రాధాన్యత ఉంటుందని పద్మనాభం దృష్టికి తీసుకెళ్లారట. జాతికి ప్రయోజనాలు ఉన్నాయంటే కలిసి ప్రయాణం చేద్దామని తెలిపిన ముద్రగడ చెప్పినట్లు సమాచారం.

వీరి భేటీ అనంతరం జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు. ముద్రగడ, నేను ఇద్దరం కలిస్తే కచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకుంటాం అన్నారు. తనకు మద్దతు ఇమ్మని అడిగానని తెలిపారు. పార్టీ అడిగితే కచ్చితంగా మళ్లీ వస్తానని తెలిపారు. ముద్రగడ రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా టీడీపీలోకి రావాలని కోరుకుంటానని స్పష్టం చేశారు.

మరోవైపు, ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిబాబు మాట్లాడుతూ.. తన తండ్రి వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపడంలేదన్నారు. ఇద్దరం పోటీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నామన్నారు. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురంలో పోటీ చేయాలనుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టారు. త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు. టీడీపీ లేదా జనసేనలో చేరడం.. పోటీ చేయడం ఖాయమని ఆయన ఓ మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు.

You may also like

Leave a Comment