నటుడు, నిర్మాత(Actor, Producer) బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు(Chandrababu) కోసం తాను చనిపోవడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఏం తప్పు చేశారని చంద్రబాబును జైల్లో పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబు దేశానికి చాలా అవసరమని చెప్పారు. హైదరాబాద్(HYD)లో ఆదివారం రాత్రి నిర్వహించిన చంద్రబాబు గ్రాటిట్యూడ్ కాన్సెప్ట్‌లో మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
హైదరాబాదులో ప్రఖ్యాతిగాంచిన సైబర్ టవర్స్ (Cyber Towers) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో చంద్రబాబు గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ (కృతజ్ఞత సంగీత కచేరీ) ఏర్పాటు చేశారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ (Anup Rubens) బృందం తమ సంగీత ప్రదర్శనతో సభకు వచ్చినవారిని ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమానికి వచ్చిన నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా బండ్ల తీవ్ర భావోద్యేగానికి లోనైన కండితడి పెట్టారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడంతో నేను వినాయకచవితి, దసరా పండుగను జరుపు కోలేదని అన్నారు. దీపావళి (Diwali) పండుగని ఘనంగా జరుపుకునేలా చంద్రబాబుకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. బాబు ఏం తప్పుడు చేశారని జైల్లో పెట్టారని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలకు, కుటుంబానికి పదవులు ఇవ్వకుండా దూరం పెట్టారన్నారు. ‘నా తండ్రి వయసు 78 ఏళ్లు. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశార్రా అని ఆయన అడిగారు. నాన్నా.. కులీకుతుబ్ షా హైదరాబాద్ (Hyderabad)ను కట్టాడు. 400 ఏళ్లయినా ఆయన పేరు చెప్పుకుంటున్నారు. అలాగే సైబర్ టవర్స్ (Cyber Towers) కట్టిన చంద్రబాబును 4 వేల ఏళ్లయినా గుర్తుంచుకుంటారు అని నాన్నతో చెప్పా’ అని గణేశ్ తెలిపారు.
ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు జై అంటున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, హైదరాబాద్‌లో, ఢిల్లీలో ఆయనకు జై కొడుతున్నారు. కానీ చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉంటే కడుపు తరుక్కుపోతోంది. ఆఖరికి భార్యాబిడ్డలను కూడా పక్కనబెట్టి ప్రజల కోసం పాటుపడిన ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందంటే కడుపు రగిలిపోతోంది. చంద్రబాబు కోసం నా ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమే… అలాంటి వ్యక్తి దేశానికి అవసరం’ అంటూ బండ్ల గణేశ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.