Telugu News » Bangalore : మహిళ స్కూటీపై లక్షల్లో ఫైన్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Bangalore : మహిళ స్కూటీపై లక్షల్లో ఫైన్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

ఆ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 277 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమె స్కూటీ ఫైన్ లు కొండలా పెరిగిపోయాయని విషయం తెలిసిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు..

by Venu

చారణ కోడికి బారాన మసాలా అంటారు.. కొన్ని ఘటనలు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే.. మనదగ్గర ఉన్న వస్తువు కాస్ట్ కంటే దానికి ఖర్చు ఎక్కువైతే.. వెంటనే స్క్రాప్ లో వేయడమో లేదా మూలకు పడవేయడమో చేస్తాము.. ఇక ఎవరికైనా వారి వాహనంపై ఫైన్ వేయిలల్లో ఉంటుంది. కానీ బండి రేటు కంటే.. చాలాన్ ఎక్కువుంటే.. గుండె బద్ధలవడం ఖాయం కదా.. కానీ ఒక టూవీలర్ మీద ఉన్న ట్రాఫిక్ ఫైన్ చూస్తే షాక్ అవుతారు..

బెంగళూరు (Bangalore)లో ఓ మహిళకు ఏకంగా రూ.1.36 లక్షల ఫైన్ పడింది. ఆమె పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో అధికారులు పెద్ద మొత్తంలో జరిమానాలు విధించారు. ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) పాటించకుండా హెల్మెట్ (Helmet) ధరించక పోవడం వల్ల.. అలాగే ఫోన్ మాట్లాడుతూ, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయడం వంటి పనుల వల్ల ఇంత మొత్తంలో జరిమానాలు పడినట్లు తెలుస్తోంది.

ఆ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 277 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమె స్కూటీ ఫైన్ లు కొండలా పెరిగిపోయాయని విషయం తెలిసిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.. కాగా ఆ స్కూటీ ఖరీదు కంటే ఫైన్ అమౌంట్ ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బండి పోలీసు స్టేషన్ లో పెట్టి మిగిలిన డబ్బు చెల్లించి వెళ్లాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయడం కనిపిస్తోంది.

మరోవైపు వంద రూపాయల ఫైన్ ఉంటే ముక్కు పిండి వసూలు చేసే అధికారులు లక్షల్లో జరిమానాలు ఉన్నా.. ఆ స్కూటీ రోడ్డుపై తిరుగుతున్న వేళ ఏం చేస్తున్నారని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.. ఇలాంటి వారి జోలికి వెళ్లరు.. కానీ ఎప్పుడైనా చిన్న పొరబాటు చేస్తే ఫోటో తీసి ఫైన్ వేసి.. ఆ బండి కనిపిస్తే జరిమానా చెల్లించే వరకు పట్టుబట్టే ట్రాఫిక్ సార్లు.. ఈ విషయంలో మౌనంగా ఎందుకున్నారంటున్నారు..

You may also like

Leave a Comment