బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రధాని షేక్ హసీనా (PM Sheikh Hasina) తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండటం తమ అదృష్టంగా పేర్కొన్నారు.. బంగ్లాదేశ్ (Bangladesh) విముక్తి పోరాటంలో భారతీయులు (Indians) తమకు అండగా ఉన్నారని గుర్తు చేశారు..
దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం ఎంతో కీలకమన్న ప్రధాని.. 2009 నుంచి 2023 వరకు తాము అధికారంలో ఉండటం వల్లే బంగ్లాదేశ్ ఈ స్థాయికి చేరుకుందని వివరించారు.. బంగ్లాదేశ్ సార్వభౌమ, స్వాతంత్య్ర దేశం ఇక్కడ జనాభా చాలా ఎక్కువని అన్నారు.. తాము ప్రజల ప్రజాస్వామ్య హక్కులను వ్యవస్థాపితం చేశాం. అది సజావుగా కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.. లేదంటే దేశాభివృద్ధి సాధ్యం కాదన్నారు..
బంగ్లాదేశ్ లో ప్రజలు నిర్భయంగా ఓటువేసే వాతావరణాన్ని కల్పించామని తెలిపిన షేక్ హసీనా.. ఈ సందర్భంగా భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు 1975 లో జరిగిన విముక్తి పోరాటం (Liberation War) లో హసీనా తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయారు. దీంతో ఆమె చాలా కాలం పాటు భారత్‌లో జీవించారు. అనంతరం బంగ్లాదేశ్‌కు వెళ్లిన హసీనా.. అవామీ లీగ్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు.
మరోవైపు బంగ్లాదేశ్ లో ఉన్న 300 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగియనున్నది. కాగా ఈ ఎన్నికల్లో 27 పార్టీలకు చెందిన 1500 మంది అభ్యర్థులతో పాటు 436 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. సుమారు 11.96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 1.5 కోట్ల మంది మొదటిసారి ఓటువేస్తున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి.