Telugu News » Mahesh Babu: మహేశ్‌బాబు సినిమా కోసం జక్కన్న భారీ ప్లాన్..!

Mahesh Babu: మహేశ్‌బాబు సినిమా కోసం జక్కన్న భారీ ప్లాన్..!

మహేశ్ సరసన నటించేందుకు ఓ ఇండోనేషియా భామను తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోన్న ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్‌ను ఆయన ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

by Mano
Mahesh Babu: Jakkanna's big plan for Mahesh Babu's movie..!

టాలీవుడ్ సూపర్ స్టార్(Super Star) మహేశ్ బాబు(Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుండగా అభిమానులు ఈ చిత్రం నుంచి మరిన్ని అప్డేట్స్ రావాలంటూ వెయిట్ చేస్తున్నారు.

Mahesh Babu: Jakkanna's big plan for Mahesh Babu's movie..!

ఈ మూవీపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ విషయం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కోసం జక్కన్న మరో భారీ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు టాక్. ఇందులో మహేశ్ సరసన నటించేందుకు ఓ ఇండోనేషియా భామను తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోన్న ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్‌ను ఆయన ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెకు స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారట జక్కన్న. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.

మహేశ్ అభిమానులు మాత్రం ఈ రూమర్ నిజమైతే బాగుండు అంటూ నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. జక్కన్న టీమ్ ఇప్పటికైనా ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ ఇవ్వాలంటూ కోరుతున్నారు. మహేశ్ కెరీర్‌లో ఇది 29వ సినిమా. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత పూర్తిగా మహేశ్ సినిమాపైనే దృష్టి పెట్టాడు. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమాను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment