Telugu News » Ravindra Jadeja: ఎడ్లబండిపై టీమిండియా ఆల్‌రౌండర్.. అభిమానులు ఫిదా..!

Ravindra Jadeja: ఎడ్లబండిపై టీమిండియా ఆల్‌రౌండర్.. అభిమానులు ఫిదా..!

అయితే జడేజా క్రికెట్‌లోనే కాదు.. అనేక విద్యల్లో ఆరితేలిన ‘ఆల్‌ రౌండర్’గా పేరు తెచ్చుకుంటున్నాడు. జడేజా ఎండ్ల‌బండి(Bullock Cart) నడుపుతూ సరికొత్త వీడియోను తన అభిమానులతో పంచుకున్నాడు.

by Mano
Ravindra Jadeja: Team India's all-rounder against Edlabandi.. fans are disappointed..!

భార‌త జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(Ravindra Jadeja) మైదానంలోకి దిగాడంటే ప్ర‌త్య‌ర్థులను బెంబేలెత్తిస్తాడు. తన అద్భుత ప్రదర్శనలతో ‘సర్ జడేజా’ అంటూ అభిమానులు ముందుగా పిలుచుకునేలా చేశాడు.

Ravindra Jadeja: Team India's all-rounder against Edlabandi.. fans are disappointed..!

అయితే జడేజా క్రికెట్‌లోనే కాదు.. అనేక విద్యల్లో ఆరితేలిన ‘ఆల్‌ రౌండర్’గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇందులో భాగంగా మైదానంలో హాఫ్ సెంచ‌రీ కొట్టిన‌ ప్ర‌తీసారి క‌త్తిసాము చేస్తూ ఫ్యాన్స్‌ను అల‌రిస్తుంటాడు. అదేవిధంగా కొన్నిసార్లు గుర్ర‌పు స్వారీ(Horse Riding) చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటాడు.

తాజాగా, మరో వీడియోను షేర్ చేశాడు సర్ జడేజా. అయితే, ఈసారి గుర్రపు స్వారీకి సంబంధించిన వీడియో మాత్రం కాదు. జడేజా ఎండ్ల‌బండి(Bullock Cart) నడుపుతూ సరికొత్త వీడియోను తన అభిమానులతో పంచుకున్నాడు.

భారీ కొమ్ములున్న‌ రెండు ఎద్దుల‌ను అదిలిస్తూ నేర్పుగా బండిని ప‌రుగులు పెట్టించాడు. ఆ వీడియోకు ‘వింటేజ్ రైడ్’ అనే క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. అదేవిధంగా మాజీ క్రికెట‌ర్లు జడేజాను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.

You may also like

Leave a Comment