Telugu News » Ayodhya : రామ మందిర ప్రాణ ప్రతిష్ట… 55 దేశాల నుంచి …..!

Ayodhya : రామ మందిర ప్రాణ ప్రతిష్ట… 55 దేశాల నుంచి …..!

ఈ కార్యక్రమానికి 55 దేశాలకు చెందిన రాయబారులు (ambassadors), ఎం)పీ (MPలు కలిపి మొత్తం 100 మందికి పైగా అతిథులను ఆహ్వానిస్తున్నట్టు వరల్డ్ హిందూ ఫౌండేషన్ గ్లోబల్ చైర్మన్ స్వామి విజ్ఞాననంద్ తెలిపారు.

by Ramu
100 Dignitaries From 55 Nations To Attend Ram Mandir Inauguration On Jan 22

అయోధ్య (Ayodhya)లో జనవరి 22న రామ మందిర (Ram Temple) ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 55 దేశాలకు చెందిన రాయబారులు (ambassadors), ఎం)పీ (MPలు కలిపి మొత్తం 100 మందికి పైగా అతిథులను ఆహ్వానిస్తున్నట్టు వరల్డ్ హిందూ ఫౌండేషన్ గ్లోబల్ చైర్మన్ స్వామి విజ్ఞాననంద్ తెలిపారు.

100 Dignitaries From 55 Nations To Attend Ram Mandir Inauguration On Jan 22

భగవాన్ శ్రీరాముడి వంశస్తురాలు అని భావిస్తున్న కొరియన్ రాణిని కూడా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించామని వెల్లడించారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెలారస్, బోట్సవానా, కెనడా, కొలంబియా, డెన్మార్క్,డొమానికా, రిపబ్లిక్ కాంగో, ఈజిఫ్టు, ఇథియోపియా, ఫిజి, ఫిన్ లాండ్, ఫ్రాన్స్ , జర్మని, ఘనా, గయానా, హంకాంగ్, హంగేరీ, ఇతర దేశాల నుంచి అతిథులను ఆహ్వానించామని పేర్కొన్నారు.

రామ మందిర కార్యక్రమానికి పలు దేశాల నేతలు హాజరవుతారని చెప్పారు. వీవీఐపీ విదేశీ ప్రతినిధులందరూ జనవరి 20న యూపీ రాజధాని లక్నోకు చేరుకుంటారని పేర్కొన్నారు. ఆ తర్వాత జనవరి 21న సాయంత్రానికి అయోధ్యకు చేరుకుంటారని విజ్ఞాననంద్ వివరించారు. అతిథుల కోసం తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

పొగమంచు, వాతావరణ పరిస్థితుల కారణంగా, ప్రతినిధులను ఈవెంట్‌కు ముందు భారతదేశానికి రావాలని అభ్యర్థించామని అన్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది విదేశీ ప్రతినిధులను ఆహ్వానించాలని అనుకున్నట్టు తెలిపారు. కానీ ఆలయంలో స్థలం తక్కువగా ఉండటంతో తక్కువ మందిని ఆహ్వానించామని చెప్పారు.

You may also like

Leave a Comment