Bhagavanth Kesari Review: భగవంత్ కేసరి సినిమా ఎప్పుడు వస్తుందా అని బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. భగవంత్ కేసరి లో బాలయ్య పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ,కాజల్ అగర్వాల్, శ్రీలీలా, అర్జున్ రాంపాల్ తదితరులు ఈ మూవీ లో నటించారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మించారు. థమన్ సంగీతాన్ని అందించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. బాలయ్య బాబు ఫాన్స్ పక్కా ఈ దసరా కి సినిమాతో ఖుష్ అయిపోతారు. మరి ఇక బాలయ్య నటించిన “భగవంత్ కేసరి” సినిమా రివ్యూ చూసేద్దాం.
Also read:
చిత్రం : భగవంత్ కేసరి
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలా, అర్జున్ రాంపాల్ తదితరులు
నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం : థమన్
దర్శకత్వం : అనిల్ రావిపూడి
విడుదల తేదీ : అక్టోబర్ 19, 2023
భగవంత్ కేసరి కథ మరియు వివరణ:
ఈ మూవీ కథ గురించి చూస్తే.. భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) ఆదిలాబాద్ నుండి వస్తాడు. భగవంత్ కేసరి జైల్లో వున్నప్పుడు ప్రిజనర్ కూతురు అయిన విజ్జి (శ్రీ లీల) ని తానె పెంచుతాడు. అయితే, కొన్ని రీజన్స్ వల్ల విజ్జి బాధ్యతలు ని భగవంత్ కేసరి తీసుకుంటాడు. ఇక కాత్యాయని (కాజల్ అగర్వాల్) ఏమో మానసిక వైద్యురాలు. పొలిటీషియన్ కొడుకు సంఘ్వీ (అర్జున్ రాంపాల్). సంఘ్వి ఒక బిజినెస్ మ్యాన్. గొప్ప వ్యక్తి అవ్వాలని ప్రపంచంలో అందరి కంటే గొప్పవాడవ్వాలని అనుకుంటాడు. విజ్జిని ఆర్మీలోకి పంపించి ధైర్యవంతురాలుగా మార్చాలని భగవంత్ కేసరి అనుకుంటాడు. సంఘ్వీకి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మధ్య సమస్యలో విజ్జి ఇరుక్కుపోతుంది.
ఈ సమస్య నుండి విజ్జీ ఎలా బయట పడింది..? భగవంత్ కేసరి ఆమె ని ఎలా బయటకి తీసుకు వస్తాడు..? అసలు భగవంత్ కేసరికి, సంఘ్వీకి గొడవ ఏమిటి..?సినిమా చూస్తే ఈ సమాధానాలు తెలుస్తాయి. ఈ మూవీ కథ నార్మల్ గానే వుంది. పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. కానీ మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ స్టోరీ ఇది. బాలయ్య, శ్రీలీల రొలెస్ బాగున్నాయి. శ్రీలీలకి, బాలకృష్ణకి మధ్య ఎమోషనల్ సీన్స్ ని అద్భుతంగా చూపించారు. థమన్ సాంగ్స్ కూడా ఒకే ఒకే గా వున్నాయి. కొత్తదనం మాత్రం మిస్ అయింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో.
ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ, శ్రీలీల పాత్రలు
ఎమోషనల్ సన్నివేశాలు
మూవీ ఇచ్చిన మంచి మెసేజ్
కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్:
లవ్ ట్రాక్ అవసరమే లేదు
రొటీన్ గా కథ
కామెడీ సీన్స్ కొన్ని
సాగదీత సన్నివేశాలు
రేటింగ్ : 3/5