Telugu News » Bhatti Vikramarka : ప్రజలపై పన్నుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన భట్టి..!

Bhatti Vikramarka : ప్రజలపై పన్నుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన భట్టి..!

డబుల్ బెడ్రూమ్ అలాట్‌మెంట్ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. పేరుకు పోయిన గ‌త బకాయిలను ఆర్థిక శాఖ‌ క్లియ‌రెన్స్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పాత బ‌స్తీలో మూడు ఫ్లై ఓవ‌ర్ల నిర్మాణం కూడా త్వరగా పూర్తయ్యే విధంగా చ‌ర్యలు తీసుకుంటామన్నారు.

by Venu
Congress MLA Bhatti Vikramarka Press Meet

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేయనుందనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.. అయితే ఈ అంశంపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) క్లారిటీ ఇచ్చారు. ఆరు గ్యారంటీల అమ‌లుకు, ఇరిగేష‌న్ ప్రాజెక్టులు, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీ గురించి కావాల్సిన నిధుల‌ను స‌మ‌కూరుస్తున్నామన్నారు. ఒక ప్రాంతం, ఏరియా అభివృద్ధి కావాల‌ని కోరుకునే వాళ్లం కాదని స్పష్టం చేశారు.. రాష్ట్రం స‌మ‌గ్రంగా అభివృద్ధి చెందాల‌ని కోరుకునే వాళ్లమని తెలిపారు.

ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం దళిత బంధుకు రూ.17,700 కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా విడుద‌ల చేయ‌లేదని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభ్యున్నతికి అత్యంత ప్రాధ‌న్యత ఇస్తుందన్నారు. సామాజిక తెలంగాణ (Telangana) నిర్మాణ‌మే ధ్యేయంగా ప్రభుత్వం ప‌ని చేస్తుందని భట్టి పేర్కొన్నారు.

జాబ్ క్యాలెండ‌ర్ (Job Calendar) ప్రక్రియ‌కు కావాల్సిన నిధులు విడుద‌ల చేస్తామని పేర్కొన్న భట్టి.. కొన్ని రోజుల్లోనే నోటిఫికేష‌న్ ప్రక్రియ మొద‌లవుతుందని తెలిపారు. అలాగే జాబ్ క్యాలెండ‌ర్‌ను ప్రతి సంవ‌త్సరం పాటిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో గ్రామ సింహాల దాడులపై స్పందించారు. కుక్కల దాడులు అరిక‌ట్టడానికి చ‌ర్యలు తీసుకుంటున్నామని, వెట‌ర్నరీ అధికారుల‌తో యాక్షన్ ప్లాన్ త‌యారు చేయిస్తామని వెల్లడించారు.

డబుల్ బెడ్రూమ్ అలాట్‌మెంట్ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. పేరుకు పోయిన గ‌త బకాయిలను ఆర్థిక శాఖ‌ క్లియ‌రెన్స్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పాత బ‌స్తీలో మూడు ఫ్లై ఓవ‌ర్ల నిర్మాణం కూడా త్వరగా పూర్తయ్యే విధంగా చ‌ర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ధ‌నిక రాష్ట్రంలో 10 సంవ‌త్సరాలుగా ల‌క్షల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టామ‌ని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకొందన్నారు..

విద్యార్థుల ఫీజు రియంబ‌ర్స్ మెంట్ 2018 నుంచి ఎందుకు క్లియ‌ర్ చేయలేదని నిలదీశారు. రాష్ట్రానికి గుది బండ‌గా మారిన ధ‌ర‌ణిని స‌రిచేయాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. అలాగే రెవెన్యూ వ్యవ‌స్థను ప్రక్షాళ‌న చేసి స‌రి చేయ‌డానికి క‌మిటీ వేశామని.. ఆ నివేదిక వ‌చ్చిన త‌ర్వాత చ‌ర్యలు తీసుకొనున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు..

You may also like

Leave a Comment