Telugu News » Bhuvanagiri : సీఎం అయ్యే అర్హత ఆయనకే ఉంది.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Bhuvanagiri : సీఎం అయ్యే అర్హత ఆయనకే ఉంది.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని భువనగిరి ఓటర్లను కోరిన రేవంత్.. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు ఇచ్చినా అది మోడీ ఖాతాలోకి వెళ్తుందని ఆరోపించారు..

by Venu
CM Revanth Reddy Orders To Enquiry On ORR Toll Tenders

భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్​కి మద్దతుగా సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా.. అధిష్ఠానం ప్రకటించిన పంచ్ న్యాయ్​ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అలాగే బీజేపీ, బీఆర్​ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.. గత ప్రభుత్వంలో అప్పుల పాలైన తెలంగాణను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

CM Revanth Reddy: Clash with the Center is a hindrance to the state's development: CM Revanth Reddyమరోవైపు తనతో పాటు ముఖ్యమంత్రి అర్హత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy)కి ఉందని సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం.. ఆయన నిజమైన పోరాట యోధుడని కొనియాడారు. తెలంగాణ కోసం తెగించి, సొంత పార్టీని ఎదిరించారని గుర్తు చేశారు.. కేసీఆర్ లాగా నకిలీ ఉద్యమం నడిపించలేదన్నారు. అదీగాక కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ తెలంగాణ స్వరాష్ట్రం కావాలని హైకమాండ్‌ను ఒప్పించినట్లు పేర్కొన్నారు.

అలాగే కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని భువనగిరి ఓటర్లను కోరిన రేవంత్.. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు ఇచ్చినా అది మోడీ ఖాతాలోకి వెళ్తుందని ఆరోపించారు.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని విమర్శించారు.. తమ ప్రభుత్వం ఉండదంటావా లాగులో తొండలు వేసి నల్గొండ బిడ్డలతో కొట్టిపిస్తానని వార్నింగ్ ఇచ్చారు..

వేల అబద్దాలు చెప్పి రూ. 7లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ వంద రోజులకే కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని అనడం ధర్మమా అని ప్రశ్నించారు. బిడ్డకు బెయిల్ కోసం భువనగిరిలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆరోపించారు. మరోవైపు రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి సోదరులు తోడైతే ఎవరూ తట్టుకోలేరని రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) వ్యాఖ్యానించారు..

భువనగిరి (Bhuvanagiri) పార్లమెంట్ సీటును గెలిపించి సీఎంకి బహుమతిగా ఇస్తామని వెల్లడించిన ఆయన.. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యత నాదేనని ప్రకటించారు. అభివృద్ధి బాధ్యత రేవంత్ రెడ్డి చూసుకుంటారు.. గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని తెలిపారు.. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్లుగా 12లో 11 స్థానాలు గెలుచుకొని చూపించామన్నారు.. కానీ సూర్యాపేట సీటు కొంచెంలో మిస్ అయిందని తెలిపారు..

You may also like

Leave a Comment