ఏపీ అసెంబ్లీకి (Ap assembly) త్వరలోనే ఎన్నికలు (Elections) జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రధాన పార్టీలు ప్రచారహోరును పెంచాయి. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ అసెంబ్లీకి (Ap assembly) త్వరలోనే ఎన్నికలు (Elections) జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రధాన పార్టీలు ప్రచారహోరును పెంచాయి. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ(Tdp), జనసేన(Janasena), బీజేపీ(BJP) అలయెన్స్ పోటాపోటీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ‘మేము సిద్ధం’ పేరుతో ప్రతిపక్షాలకు సవాళ్లు విసురుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. కానీ, ఇటీవల కాలంలో అధికార పార్టీ నుంచి తెలుగుదేశం, జనసేనలోకి వలసలు భారీగా పెరిగాయి. దీనంతటికీ జగన్ నిర్ణయాలే కారణమని కొందరు నేతలు బాహటంగానే ప్రశ్నిస్తున్నారు. మరికొందరు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పదని భావించి ముందే తమ ఇంటిని చక్కబెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ ప్రతిపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేయాలని భావిస్తున్నారు. అందుకే జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 14న అనంతరంపురం జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే, ఆ పర్యటనలో భాగంగా సీఎం జగన్‌కు పెను ప్రమాదం తప్పింది. సీఎం హెలిప్యాడ్ ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.త
అనంతరం జిల్లాలో హెలిక్యాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాల్లోకి చీపురు పైకి లేవగా.. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సీఎం జగన్ సైతం జిల్లా అధికారుల మీద సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.