Telugu News » Bill Gates Meets Modi: ప్రధాని మోడీతో బిల్‌గేట్స్ భేటీ.. ఆ అంశాలపై చర్చ..! ‌

Bill Gates Meets Modi: ప్రధాని మోడీతో బిల్‌గేట్స్ భేటీ.. ఆ అంశాలపై చర్చ..! ‌

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌(Microsoft co-founder Bill Gates) భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)తో భేటీ అయ్యారు.

by Mano
Bill Gates Meets Modi: Bill Gates meeting with Prime Minister Modi.. Discussion on those issues..! the

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌(Microsoft co-founder Bill Gates) భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)తో భేటీ అయ్యారు. ప్రజా శ్రేయస్సుకు కృత్రిమ మేధ, వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు, మహిళల భాగస్వామ్యంతో అభివృద్ధి వంటి అంశాలపై మోడీతో చర్చించినట్లు బిల్‌గేట్స్‌ ట్వీట్ చేశారు.

Bill Gates Meets Modi: Bill Gates meeting with Prime Minister Modi.. Discussion on those issues..! the

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలవడం ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని బిల్‌ గేట్స్‌ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ప్రధాని మోడీ రీట్వీట్ చేస్తూ ఇది నిజంగా అద్భుతమైన సమావేశమంటూ రిప్లై ఇచ్చారు. భూగ్రహాన్ని మెరుగుపరిచేలా, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులను శక్తిమంతం చేసే రంగాలపై చర్చించడం సంతోషకరమని తెలిపారు.

కాగా, కేంద్రమంత్రులు, జైశంకర్‌, మన్‌సుఖ్‌ మాండవీయతోనూ బిల్‌ గేట్స్‌ భేటీ అయ్యారు. ఆరోగ్యం, విద్య, మహిళల ఆర్థిక సాధికారత వంటి అంశాలపై చర్చించారు. ఆరోగ్య మైత్రి, క్యూబ్‌ భీష్మ్‌ వంటి డిజిటల్‌ హెల్త్‌ ఆవిష్కరణలను ఆయన ప్రశంసించారు. పిల్లల పోషణ, శ్రేయస్సుకు కేంద్రం అమలు చేస్తున్న పోషణ్‌ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రశంసించారు.

డాలీ చాయ్‌వాలా తేనీటి రుచి చూసిన బిల్‌గేట్స్ సంబంధిత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. అనంతరం భారత్‌లో బిజీ షెడ్యూల్‌లో ఉన్నారయన. రిలయన్స్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలకూ హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒడిశాకు చేరుకున్నారు. పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఐడీసీ)ను బుధవారం సందర్శించారు.

You may also like

Leave a Comment