ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యహారంలో రాధాకిషన్ గ్యాంగ్ (Radakishan rao gang) అక్రమాలు ఒక్కొక్కొటిగా బయటకొస్తున్నాయి. గతంలో తెలంగాణలో జరిగిన మూడు ఉపఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలకు చెందిన డబ్బును రాధాకిషన్ గ్యాంగ్ పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన డబ్బును పోలీసుల వాహనాల్లోనే పంపిణీ చేసి కేవలం ప్రత్యర్థుల డబ్బును మాత్రమే పట్టుకోవడం వెనుక అధికారిక పార్టీ హస్తం ఉందని విచారణలో ఈ గ్యాంగ్ అంగీకరించింది.
బై పోల్స్‌లో ప్రత్యర్థులు లాభపడకుండా ఉండేందేకు రాధాకిషన్ అంగ్ గ్యాంగ్ పక్కా స్కెచ్ వేసి డబ్బులు పట్టుకున్నట్లు తెలిసింది. వీరి రిమాండ్ రిపోర్టులో మరోసారి బీఆర్ఎస్ సుప్రీం పేరు ప్రస్తావించినట్లు సమాచారం. గతంలో రాధా కిషన్ అండ్ గ్యాంగ్ 3 ఉపఎన్నికల సందర్బంగా 9 సార్లు ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసి డబ్బులను పట్టుకున్నట్లు విచారణలో తేలింది.ప్రణీత్‌రావు ఇచ్చే సమాచారంతో తన ఇన్స్పెక్టర్లను పంపి రాధాకిషన్ రావు గ్యాంగ్ డబ్బులను స్వాధీనం చేసుకునేవారు.
ఎన్నికల టైంలో డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతున్నాయనే సమాచారాన్ని ప్రభాకర్ రావుకి, ప్రణీత్ రావు చెరవేసేవారు.అనంతరం ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు తన బృందాన్ని పంపించి డబ్బులను సీజ్ చేయించేవారు. ఇలా 2018 జనరల్ ఎలక్షన్స్‌లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్‌కి చెందిన రూ.70లక్షలు, 2020 దుబ్బాక బైపోల్ టైంలో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో బేగంపేట వద్ద రఘునందన్ రావు చిట్ ఫండ్ కంపెనీకి చెందిన రూ.కోటిని టాస్కోఫోర్స్ పట్టుకున్న విషయం తెలిసిందే.
ఇక 2022 అక్టోబర్‌లో మునుగోడు బైపోల్ సందర్భంగా గాంధీనగర్ వద్ద 3.50కోట్లను టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. అవి మునుగోడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డివి అని తేల్చారు. అదేవిధంగా 2023 అక్టోబర్‌లో బంజారాహిల్స్‌లో రూ.3.35 కోట్లు పట్టుకున్నారు. ఈ డబ్బు కాంగ్రెస్ సపోర్టర్ AMR ఇన్ఫ్రా ki చెందిన మహేష్ రెడ్డివి. 2023 అక్టోబర్‌లో తార్నాక వద్ద రూ.22 లక్షలు, అదే రోజు మరోచోట రూ.15 లక్షలను టాస్క్‌ఫోర్స్ టీమ్ సీజ్ చేసింది.
2023 అక్టోబర్‌లో హిమాయత్ నగర్‌లో ఖాజిల్ మాలిక్ నుంచి రూ.49 లక్షలను పట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ఇచ్చే సమాచారం ఆధారంగా రాధాకిషన్ రావు గ్యాంగ్ డబ్బులను పట్టుకున్నట్లు విచారణ బృందం తేల్చింది.
ఇకపోతే, ప్రతిపక్షాల డబ్బులను సీజ్ చేసి బీఆర్ఎస్ నేతలకు చేరవేసిన రాధాకిషన్ రావు బృందం..తన చిన్ననాటి స్నేహితుడైన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి పూర్తిస్థాయిలో సాయం అందజేసినట్లు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఏకంగా రూ .4 కోట్ల డబ్బులను విడతల వారీగా పోలీసుల వాహానాల్లోనే ఎస్కార్ట్‌ను పెట్టిమరీ వెంకట్రామిరెడ్డికి అందజేసినట్లు తెలిసింది. అప్పట్లో తెల్లాపూర్‌లోని రాజ్ పుష్ప గ్రీన్ డెల్ విల్లాస్‌లో వెంకట్రాంరెడ్డి ఇంటికి దగ్గరలో ఉండే శివ చరణ్ రెడ్డి వద్ద నుంచి టాస్క్‌ఫోర్స్ ఎస్సై డబ్బులు తీసుకెళ్లి సికింద్రాబాద్‌లో ఉండే మాజీ ఎస్పీ దివ్య చరణ్‌కు అందజేసినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో ఎవరికి డౌట్ రాకుండా రాధాకిషన్ రావు పలుమార్లు ఫోన్ నంబర్లు, ఐఫోన్ కొని ఎస్సైకు ఇచ్చాడు. ఈ క్రమంలోనే రాధాకిషన్ రావుకు సహకరించిన ఎస్సైలు, మాజీ ఎస్పీని విచారించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.